Passport: పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ అయిపోయిందా.. ఎలా రెన్యువల్ చేయాలంటే..
భారత్ నుండి ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ, ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ అనేది చాలా కీలకం. ఒకసారి పాస్‌పోర్ట్ జారీ చేయబడితే అది పదేళ్ల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ కాలం ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా రిన్యువల్ చేసుకోవాలో తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన వంటి పలు కారణాల వల్ల చాలా మంది విదేశాలకు ప్రయాణిస్తుంటారు. వారు పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా ప్రభుత్వ సంస్థ నుండి పొందాలి, దీనిలో వారి ప్రయాణానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి.
పాస్‌పోర్ట్ రెన్యువల్ పద్ధతి
18ఏళ్లు దాటని వారికీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఐదు సంవత్సరాలు లేదా 18ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. ఆ తరువాత పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోవాలి.15-18సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ పొందవచ్చు. ఒకసారి పాస్‌పోర్ట్ గడువు ముగిసిన తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో సులభంగా రిన్యువల్ చేసుకోవచ్చు. 'పాస్‌పోర్ట్ సేవ' వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి:కొత్తగా రిజిస్టర్ చేసుకోని వారు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ ఐడీ పొందాక, లాగిన్ చేయవచ్చు. లాగిన్ అవ్వాలి:Apply for fresh passport/Reissue of Passport అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తగిన వివరాలు: అక్కడ అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. పేమెంట్: Pay and Schedule Appointment పేజీలోకి వెళ్లి పేమెంట్ విధానం ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి.
పాస్‌పోర్ట్ రెన్యువల్ పద్ధతి
ఫారమ్ సబ్మిట్: అన్ని వివరాలను సమర్పించిన తరువాత ఫారమ్ సబ్మిట్ చేయాలి. Receipt ప్రింట్: Print Application Receipt పై క్లిక్ చేయాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం: అవసరమైన పత్రాలు తీసుకొని నిర్ణీత తేదీలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి.
అపాయింట్‌మెంట్ బుకింగ్ విధానం
పాస్‌పోర్ట్ సేవ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. View Saved and Submit Application ను సెలెక్ట్ చేసి, Pay and Schedule Appointment పై క్లిక్ చేయాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం: కేంద్రాన్ని, పేమెంట్ విధానాన్ని ఎంచుకోవాలి. తేదీ, సమయం: అపాయింట్‌మెంట్ కోసం తేదీ, సమయాన్ని ఎంచుకొని Pay and Book the Appointment పై క్లిక్ చేయాలి.
అవసరమైన పత్రాలు
ఒరిజినల్ పాస్‌పోర్ట్ స్వీయ ధ్రువీకరించిన ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు అడ్రస్ ప్రూఫ్ పాస్‌పోర్ట్ మొదటి,చివరి పేజీల జిరాక్స్ కాపీలు చెల్లుబాటు అయ్యే ఎక్స్‌టెన్షన్ పేజీ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్. ఈ విధంగా, పాస్‌పోర్ట్ రిన్యువల్ ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తవుతుంది.