NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Budget: బడ్జెట్ నుండి భారతదేశ సాంకేతిక రంగానికి సంబంధించిన విష్‌లిస్ట్ ఏమిటి?
    తదుపరి వార్తా కథనం
    Budget: బడ్జెట్ నుండి భారతదేశ సాంకేతిక రంగానికి సంబంధించిన విష్‌లిస్ట్ ఏమిటి?
    బడ్జెట్ నుండి భారతదేశ సాంకేతిక రంగానికి సంబంధించిన విష్‌లిస్ట్ ఏమిటి?

    Budget: బడ్జెట్ నుండి భారతదేశ సాంకేతిక రంగానికి సంబంధించిన విష్‌లిస్ట్ ఏమిటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 22, 2024
    10:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే అతి ముఖ్య సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.నిరుద్యోగి అంటే పని రానోడనో,పనికి రానోడనో కాదు,పని లేనోడు అంతే .! అంటూ నిరుద్యోగ భారతాన్ని నిర్వచించాడో కవి.

    దేశంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్రతిసారి విద్యకి,నైపుణ్యాభివృద్ధికి ఎంతో బడ్జెట్ కేటాయిస్తారని ఆశగా ఎదురు చూడటం,ఇంతే కేటాయిoచారా అని ఉస్సూరు మనడం పరిపాటిగా మారింది.

    మన దేశంలోని టెక్ రంగానికి రాబోయే రెండు మూడు సంవత్సరాలల్లో ప్రస్తుతం డిమాండ్ బాగా ఉన్నAI,ఇతర సామర్ధ్యాలు ఉన్న దాదాపు పది లక్షలకి పైగా ఇంజనీర్లు అవసరం ఉన్నారని టెక్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పే మాట.

    కాబట్టి ఆ డిమాండ్ కి తగ్గట్టుగా మన దేశంలో విద్యకి,నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్ లో సముచితమైన స్థానం ఇవ్వడం చాలా అవసరం.

    వివరాలు 

    టెక్ పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులలో 50శాతానికి పైగా రీ స్కిల్ చేయాలి 

    ప్రపంచం లో ఏ దేశానికి లేనంత యువ,శ్రామిక శక్తి మన భారత దేశానికి ఉంది.అయినప్పటికీ శ్రామిక శక్తికి,నిరుద్యోగ యువతకి ఉపాది కలిపించడం అనేది ఒక పెద్ద సవాలు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ),బిగ్ డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో ఉన్న స్థానాలని భర్తీ చెయ్యాలంటే తగినంత పని అవసరం ఉంటుంది.

    ప్రస్తుతం టెక్ పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులలో 50శాతానికి పైగా రీ స్కిల్ చెయ్యాల్సి ఉంటుంది.

    దీంట్లో ఉన్న మరో సవాలు ఏంటంటే పరిశ్రమలో అందరు ఒక్కసారిగా నైపుణ్యం సాధించడం సాద్యం కాదు.

    వేగంగా మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్ యుగంలో నైపుణ్యాభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ,నిరంతర ప్రయాణం.

    వివరాలు 

    టెక్ సేవలు 7.5 శాతం

    ఇక్కడే దేశంలో అమలవుతున్న విద్య, నైపుణ్యాభివృద్ధి జరుగుతున్న తీరు ఫోకస్ లోకి వస్తుంది .

    ఈ ముఖ్యమైన రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కువ భాగం పెట్టుబడి పెట్టాలి.

    భారతదేశం $250 బిలియన్ల సాంకేతిక రంగం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

    ఈ రంగం దాదాపు 5.4 మిలియన్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పిస్తోంది.

    దేశం $3 ట్రిలియన్ల స్థూల జాతీయోత్పత్తిలో టెక్ సేవలు 7.5 శాతంగా ఉన్నాయి.

    NASSCOM ప్రకారం, డిజిటల్ ప్రతిభకు డిమాండ్-సరఫరా తేడా 2028లో 25 శాతం నుండి 2029లో దాదాపు 29 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది.

    వివరాలు 

    నైపుణ్యాల గ్యాపే 80,000 స్థానాలను నింపకుండా అడ్డుకుంటోంది 

    వర్క్‌ఫోర్స్ స్కిల్ సెట్‌కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి టెక్ కంపెనీల అవసరాలకు మధ్య చాలా తేడా ఉంది.

    ఇది TCSకు ఓపెన్ పొజిషన్‌లను నింపడంలో చాలా సమస్యలని తెస్తుంది.బహుళజాతి పవర్‌హౌస్‌ లయిన IBM, యాక్సెంచర్ వంటి కంపెనీల ముందు భారతీయ టెక్ సంస్థలను తక్కువ పోటీగా మార్చవచ్చు.

    ఈ నైపుణ్యాల గ్యాపే 80,000 స్థానాలను నింపకుండా అడ్డుకుంటోందని గత నెలలో TCS ప్రకటించింది.

    జూన్‌లో, భారతదేశంలోని అతిపెద్ద ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ, లార్సెన్ & టూబ్రో, దాని టెక్-ఎనేబుల్డ్ సర్వీసెస్ విభాగంలో ఇరవై వేల మంది ఇంజనీర్లు తక్కువగా ఉన్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    చదువుకున్న యువకులే నిరుద్యోగులు 

    బెంగళూరులోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో ఎలిమెంటరీ స్కూల్ నుండి హైస్కూల్ వరకు సరైన నాణ్యత లేని విద్య దేశంలో నైపుణ్యం అంతరానికి ప్రధాన కారణమని అన్నారు.

    నేటి లేబర్ మార్కెట్‌లో విజయవంతం కావడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో విద్యార్థులను తయారు చేయడంలో కళాశాలలు విఫలమవుతున్నాయని ఆమె తెలిపారు.

    ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన తాజా నివేదిక ప్రకారం, పాఠశాల విద్య లేని వారి కంటే కళాశాలలో చదువుకున్న యువకులే నిరుద్యోగులుగా ఉంటారు.

    వివరాలు 

     అందరి దృష్టి రేపటి బడ్జెట్‌పైనే

    భారతదేశం వంటి దేశంలో, 1.4 బిలియన్లకు పైగా జనాభాలో సగం మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, విద్య లేకపోవడం అభివృద్ధి అవకాశాలను అడ్డుకుంటుంది.

    ఈ సారైనా ప్రభుత్వం ప్రవేశ పెట్టె బడ్జెట్‌లో విద్య, శిక్షణకు నిధులు పెంచుతుందా? టెక్ రంగాల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారా?

    ఈ ప్రశ్నలకు,మరిన్నింటికి సమాధానాల కోసం అందరి దృష్టి రేపటి రోజున అంటే జూలై 23న బడ్జెట్‌పై ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు ఆర్ధికవేత్త
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి నిర్మలా సీతారామన్
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025