WhatsApp-Jio: జియోతో చేతులు కలిపిన వాట్సాప్.. త్వరలో ఇంటర్నేషనల్ ఈసిమ్ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు విదేశాల్లో మొబైల్ డేటా ఉపయోగించుకునేందుకు వీలుగా యాప్‌లోనే ఇంటర్నేషనల్ డేటా ఈసిమ్ (eSIM) కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. ఇందుకోసం భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తొలుత ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
వివరాలు
యాప్‌లోనే ఈసిమ్ కొనుగోలు.. ప్రయాణికులకు సులభంగా ఇంటర్నెట్ సేవలు
ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు విదేశాలకు వెళ్లినప్పుడు వాట్సాప్ యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొన్ని క్లిక్‌లతో డేటా ఈసిమ్‌ను కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ప్రయాణ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ పొందడం మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశమని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.
మెసేజ్ పంపినంత సులభంగా ఈసిమ్ సేవలను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.
ఆండ్రాయిడ్ అథారిటీ కథనం ప్రకారం.. వాట్సాప్ యాప్ 2.26.47.10 వెర్షన్ కోడ్‌లో ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి.
వినియోగదారులు తాము వెళ్లాలనుకుంటున్న దేశం పేరును నమోదు చేస్తే.. అక్కడ పనిచేసే ఈసిమ్ ప్లాన్లను యాప్ చూపించే అవకాశం ఉంది.
వివరాలు
ఈసిమ్ ప్లాన్లు, డేటా బ్యాలెన్స్ వివరాలు వాట్సాప్‌లోనే!
అందులో తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకుని కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా ఇప్పటికే కొనుగోలు చేసిన ఈసిమ్‌లు, గడువు ముగిసిన ప్లాన్ల వివరాలను కూడా చూసుకోవచ్చు.
ప్రస్తుతం ఎంత డేటా మిగిలి ఉందో తెలుసుకునే సదుపాయం కూడా ఉండనుంది.
డేటా అయిపోవస్తున్నప్పుడు, ఈసిమ్ ప్లాన్ గడువు ముగియబోతున్నప్పుడు వాట్సాప్ ముందుగానే హెచ్చరికలు పంపించే అవకాశం ఉందని సమాచారం.
ఈ సేవల కోసం జియోతో పాటు స్మార్ట్ అక్సియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్, వెరిజోన్ వంటి టెలికాం సంస్థలు, పలు ఈసిమ్ సేవల సంస్థలతోనూ వాట్సాప్ భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు యాప్‌లోనే సమాచారం కనిపిస్తుందని సంస్థ వెల్లడించింది.
వివరాలు
వాట్సాప్ సేవల విస్తరణపై కొత్త ప్రణాళికలు!
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్ పనిచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈసిమ్ సేవలపై పరిశీలన ప్రారంభించామని వాట్సాప్ సీఈఓ కునాల్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఎక్కడున్నా అంతరాయం లేకుండా మెసేజ్‌లు, స్టిక్కర్లు పంపుకునేలా ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్‌గా మాత్రమే కాకుండా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వేదికగా మారేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవలే వాట్సాప్ వ్యక్తిగత,గ్రూప్ చాట్లలో మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని పరిచయం చేసింది.
10 నిమిషాల నుంచి 14 రోజుల ముందుగానే టెక్స్ట్ మెసేజ్‌లు,ఫొటోలు,వీడియోలను పంపించే సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.
అంతకుముందు కునాల్ షా వాట్సాప్ భవిష్యత్తు ప్రణాళికల్లో మూడు ప్రధాన అంశాలను వెల్లడించారు.
వివరాలు
వాట్సాప్‌లో మరిన్ని సేవలకు ప్రాధాన్యం..
కమ్యూనికేషన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం, రోజువారీ సేవలను సులభతరం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను యాప్‌లోకి తీసుకురావడం వాటిలో ఉన్నాయి.
ఇందులో భాగంగా బిల్లు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల వంటి సేవలను కూడా వాట్సాప్‌లోనే సులభంగా నిర్వహించేలా మార్పులు చేస్తోంది.
ఎంపిక చేసిన కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకసారి మాత్రమే చూడగలిగే టెక్స్ట్ మెసేజ్‌ల ఫీచర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు అత్యధిక వినియోగదారులు ఉన్న దేశం భారత్. మన దేశంలోనే 50 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జియోతో కలిసి తీసుకురానున్న ఈసిమ్ సదుపాయం భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తే విదేశీ ప్రయాణాల్లో ఉపయోగకరంగా మారనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జియోతో చేతులు కలిపిన వాట్సాప్..
. @WhatsApp Teams Up With Jio To Bring International Data eSIMs To India. 👇
— Inc42 (@Inc42) November 27, 2026
The upcoming feature will let users buy and install international data eSIMs directly within WhatsApp, without leaving the app. Users may also be able to track data balances, view expired plans and… pic.twitter.com/4cDSkd6BlC