Dan Shapero: లింక్డ్‌ఇన్ కొత్త సీఈవోగా డాన్ షపీరో నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్'కు కొత్త సీఈవోగా డాన్ షపీరో ను నియమించినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సీఈవోగా ఉన్న రయాన్ రోస్లాన్స్కీ(Ryan Roslansky)2020 నుంచి బాధ్యతలు నిర్వర్తించగా, ఇకపై మైక్రోసాఫ్ట్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు. ఈ నాయకత్వ మార్పును రోస్లాన్స్కీ స్వయంగా లింక్డ్‌ఇన్ పోస్టులో వెల్లడించారు. డాన్ షపీరో 2008లో లింక్డ్‌ఇన్‌లో రీసెర్చ్ నెట్‌వర్క్ జనరల్ మేనేజర్‌గా చేరి, తర్వాత సీఓఓ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. సీఓఓగా ఉన్నప్పుడు సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్ట్ విభాగాలను సమర్థంగా నడిపారు. లింక్డ్‌ఇన్‌లో చేరకముందు ఆయన బైన్ & కంపెనీలో మేనేజర్‌గా పనిచేశారు. అలాగే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో విద్య పూర్తి చేశారు.
వివరాలు
స్పందించిన షపీరో
మరోవైపు, గతంలో జెఫ్ వీనర్ తర్వాత బాధ్యతలు చేపట్టిన రోస్లాన్స్కీ, ఇకపై లింక్డ్‌ఇన్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్టివిటీ గ్రూప్‌ను కూడా ముందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఉద్యోగాలు, కెరీర్ అభివృద్ధిపై వేగంగా పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ టీమ్స్, టాలెంట్‌ను మరింత విస్తరించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన నియామకంపై స్పందించిన షపీరో, లింక్డ్‌ఇన్ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల కోసం పూర్తిగా కట్టుబడి ఉంటానని షపీరో తెలిపారు. ఈ సంస్థలో పనిచేయడం తన జీవితంలో ఎంతో ముఖ్యమైన అనుభవమని పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్ సంస్కృతి, సహచరులు తన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.