Wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 1.31 శాతానికి తగ్గింది
భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 2.04 శాతం నుంచి ఆగస్టులో 1.31 కనిష్ఠానికి పడిపోయింది. కూరగాయలు, ఇంధనం, ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా రెండో నెల టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ధరల ద్రవ్యోల్బణం గత జూలైలో 3.45 శాతం నుండి ఆగస్టులో 3.11 శాతానికి తగ్గింది. ఈ కాలంలో ఇంధనం, విద్యుత్ ధరలు కూడా తగ్గాయి. ఆహార వస్తువుల కేటగిరీలో తృణధాన్యాలు (8.44 శాతం పెరిగాయి), వరి (9.12 శాతం పెరిగాయి), పప్పుధాన్యాలు (18.57 శాతం పెరిగాయి) ధరల పెరుగుదల రేటులో తగ్గుదల కనిపించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం
ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టి 65.75 శాతానికి తగ్గాయి. ఇక బంగాళదుంపల ధరలు (77.96 శాతం పెరిగాయి), పండ్ల ధరలు (16.7 శాతం పెరిగాయి) నెలలో పెరిగాయి. ప్రధానంగా హై-స్పీడ్ డీజిల్ (-3.03 శాతం), పెట్రోల్ (-4.23 శాతం) ధరలు క్షీణించడం వల్ల ఇంధనం, విద్యుత్ కోసం ఫ్యాక్టరీ గేట్ ధరలు ఆగస్టులో 0.67 శాతం తగ్గాయి. అయితే ఇదే సమయంలో వంటగ్యాస్ ధర 14.4 శాతం పెరిగింది . WPI ద్రవ్యోల్బణంలో ఇటీవలి క్షీణత భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడానికి దోహదం చేస్తుంది. టోకు ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం సెప్టెంబర్‌లో కనిపిస్తుంది.