Jio Down: జియో నెట్‌వర్క్‌లో భారీ అంతరాయం.. ట్రెండ్‌లోకి #JioDown
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది. జియో వినియోగదారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి తమ సేవలు పని చేయకపోవడంతో, సోషల్ మీడియాలో #JioDown హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్రాకింగ్ వెబ్‌సైట్ "డౌన్ డిటెక్టర్" ప్రకారం, సెప్టెంబర్ 17, 2024 మధ్యాహ్నం 12.18 గంటలకు 10,367 నెట్వర్క్ సమస్యలకు సంబంధించి రిపోర్ట్‌లు నమోదయ్యాయి. వాటిలో 68శాతం సిగ్నల్ సమస్యలు, 18శాతం మొబైల్ ఇంటర్నెట్ సమస్యలు, 14శాతం జియో ఫైబర్‌కు సంబంధించినవి ఉన్నాయి.
జియో నెట్‌వర్క్ సర్వీస్ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ
ఇతర నెట్వర్క్‌లు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ యథావిధిగా పని చేస్తుండగా, జియో వినియోగదారులు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొన్నారు. జియో వినియోగదారులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా ఫోన్‌లో రెండు జియో సిమ్‌లు ఉన్నాయి, ఒక్కటి కూడా పని చేయడం లేదని ఓ యూజర్ పేర్కొన్నారు. పలువురు వినియోగదారులు జియో నెట్‌వర్క్‌పై సర్వీస్ సమస్యలు తరచుగా వస్తున్నాయని, దీనిపై కంపెనీ దృష్టిపెట్టాలని కోరారు.