Loading...
Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?
ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?

Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉపయోగించని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకునేలా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది. ఆగస్టు చివరినాటికి వ్యాపారాన్ని పెంచుకోవాలనే కంపెనీ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా యాక్సెంచర్ అనుసరించే విధానానికి ఇది భిన్నమైన నిర్ణయం. ఈ సమయంలో మరింత మంది ఉద్యోగులు వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.

వివరాలు

మరింత వ్యాపారం తీసుకురావాలని సీఈఓ పిలుపు..

యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ఉద్యోగులకు కీలక సూచన చేశారు.

2026 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీకి మరింత వ్యాపారం తీసుకురావాలని ఆమె కోరారు.

ఇటీవల వెలువడిన కంపెనీ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి.

దీంతో యాక్సెంచర్ షేర్లు ఏకంగా 20 శాతం వరకు పడిపోయాయి. "నాలుగో త్రైమాసికంలో కంపెనీ మంచి ఫలితాలు సాధిస్తుందని మా వాటాదారులు ఆశిస్తున్నారు.

ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించవచ్చు" అని జూలీ స్వీట్ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు.

వివరాలు

కొత్త బుకింగ్స్, ఆదాయ అంచనాల్లో తగ్గుదల..

మే 31తో ముగిసిన త్రైమాసికంలో యాక్సెంచర్ కొత్త బుకింగ్స్ 2 శాతం తగ్గినట్లు ప్రకటించింది.

అంతేకాకుండా ఆగస్టుతో ముగిసే మూడు నెలల కాలానికి కంపెనీ ఆదాయం 17.75 బిలియన్ డాలర్ల నుంచి 18.4 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

అయితే బ్లూమ్‌బర్గ్ సేకరించిన విశ్లేషకుల సగటు అంచనా 18.47 బిలియన్ డాలర్లుగా ఉంది.

దీంతో కంపెనీ అంచనాలు మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ ఫలితాల తర్వాత పెట్టుబడిదారుల్లో ప్రతికూల స్పందన కనిపించింది.

జూన్ 18న యాక్సెంచర్ షేర్లు 18 శాతం పడిపోయి 127.98 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ చరిత్రలో ఒక్క రోజులో నమోదైన అత్యంత భారీ పతనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు

యాక్సెంచర్ వ్యాపారానికి ఏఐ 'టెయిల్‌విండ్' అంటూ సీఈఓ..

మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తమ వ్యాపారానికి అనుకూలంగా పనిచేసే అంశంగా ఉంటుందని జూలీ స్వీట్ పేర్కొన్నారు.

ఏఐ తమ వ్యాపారానికి 'టెయిల్‌విండ్'గా పనిచేస్తోందని ఆమె అభివర్ణించారు.

అయితే సమీప కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే మార్పులు, అంతరాయాలపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.

"సర్వీసెస్, కన్సల్టింగ్ రంగాలకు ఏఐ ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా ఉంది" అని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ఇటీవల పేర్కొంది.

మూడో త్రైమాసిక ఫలితాల తర్వాత యాక్సెంచర్ షేర్లు కొంతమేర కోలుకున్నాయి. ఆగస్టు 7న షేరు ధర 171.11 డాలర్లకు చేరింది.

అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే యాక్సెంచర్ షేర్లు ఇప్పటికీ 36 శాతానికి పైగా నష్టాల్లోనే ఉన్నాయి.

ADVERTISEMENT