Anthropic AI Tool: కృత్రిమ మేధ 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' విడుదల.. షాక్'లో ఐటీ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) రంగంపై ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఆసక్తి పెంచుతున్న సమయంలో, 'ఆంత్రోపిక్' సంస్థ తన కొత్త AI టూల్‌ను పరిచయం చేసి సంచలనం సృష్టించింది. ఈ వార్తతో కేవలం అమెరికా టెక్ మార్కెట్ మాత్రమే కాదు, భారత ఐటీ షేర్ల మార్కెట్ కూడా గణనీయంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు సుమారు 7 శాతం కూలిపోయాయి. ఇది ఆంథ్రోపిక్ టూల్ సృష్టించిన ఆందోళనను స్పష్టంగా చూపుతోంది.
వివరాలు
ఆంథ్రోపిక్ కొత్త AI టూల్ - 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్'
'క్లాడ్ చాట్‌బాట్' సృష్టికర్తగా ప్రసిద్ధి పొందిన అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్, ఇటీవల 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్'కు 11 ఓపెన్ సోర్స్ ప్లగ్‌ఇన్‌లను విడుదల చేసింది. ఇవి లీగల్,సేల్స్,మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో ఆటోమేషన్ కోసం ఉపయోగపడతాయి. ఫైనాన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బయాలజీ రీసెర్చ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లోనూ ఈ టూల్ కీలక పాత్ర పోషిస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఈ అప్‌డేట్లతో 'క్లాడ్ కోవర్క్' కేవలం చాట్‌బాట్‌గానే కాకుండా,ఒక సహోద్యోగి (TeamMate) లాగా పని చేయగలదు. ఇది మన కంప్యూటర్‌లో వర్క్ చేయగలదు, ఫైల్స్‌ని చదవగలదు, డాక్యుమెంట్లను ఎడిట్ చేయడం, కొత్త ఫైల్స్ సృష్టించడం, రీనేమ్ చేయడం, ఫోల్డర్లను ఆర్గనైజ్ చేయడం, నోట్స్‌ని రిపోర్టులుగా మార్చడం వంటి పనులు చేయగలదు.
వివరాలు
ఆంథ్రోపిక్ కొత్త AI టూల్ - 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్'
రచయితలు, అనలిస్టులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఆఫీస్ వర్క్ చేసే యూజర్లు దీన్ని ఉపయోగించవచ్చు. అంతేకాదు, లాయర్లు, పెద్ద కంపెనీల కోసం ప్రత్యేక టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఆంథ్రోపిక్ తెలిపింది.
వివరాలు
భారత ఐటీ షేర్లపై ప్రభావం
డాక్యుమెంట్ల రివ్యూ, డేటా అనాలిసిస్ వంటి పనులు సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీలు భారత ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు ఔట్‌సోర్సింగ్ ద్వారా అప్పజేస్తాయి. అయితే ఆంథ్రోపిక్ AI టూల్ ద్వారా ఈ పనులు ఆటోమేటిక్‌గా జరిగే అవకాశం ఉంది. అందువల్ల, భారత ఐటీ మార్కెట్‌లో సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఫలితంగా ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ, టీసీఎస్, విప్రో, టెక్ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.
వివరాలు
సాస్పోకాలిప్స్- అనలిస్టుల ఆందోళన
ఈ పరిణామాన్ని అనలిస్టులు 'సాస్పోకాలిప్స్ (SaaSpocalypse)' అని పేర్కొన్నారు. అంటే, మొదట 'AI కంపెనీలకు సహాయం చేస్తుంది' అనిపిస్తే, ఇప్పుడు 'AI ఉద్యోగాలను భర్తీ చేస్తుంది' అని ఆందోళన ఏర్పడింది. ఇలాంటి AI టూల్స్ కారణంగా సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీస్ కంపెనీల మధ్య పోటీతత్వ విధానాలు మారవచ్చని కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. డెవలప్‌మెంట్, టెస్టింగ్ వంటి ఎంట్రీ లెవల్ టాస్క్‌లను ఈ AI టూల్ భర్తీ చేయడం వల్ల కొంతమంది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .