Loading...
Loan Settlements: రుణం చెల్లించలేకపోతున్నారా? బ్యాంకులు సెటిల్‌మెంట్‌కు ఎందుకు అంగీకరిస్తాయి.. క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఇదే!
రుణం చెల్లించలేకపోతున్నారా? బ్యాంకులు సెటిల్‌మెంట్‌కు ఎందుకు అంగీకరిస్తాయి.. క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఇదే!

Loan Settlements: రుణం చెల్లించలేకపోతున్నారా? బ్యాంకులు సెటిల్‌మెంట్‌కు ఎందుకు అంగీకరిస్తాయి.. క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఇదే!

వ్రాసిన వారు Moogati Shabari
Sep 04, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

రుణగ్రహీత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, తీసుకున్న రుణానికి సంబంధించిన మొత్తం బకాయిని చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు.. బ్యాంక్ లేదా రుణదాత కొంత మొత్తాన్ని మాఫీ చేసేందుకు అంగీకరించే అవకాశం ఉంటుంది. అసలు, వడ్డీ, జరిమానాలు లేదా ఇతర ఛార్జీల్లో కొంత భాగాన్ని తగ్గించి, ఇరువర్గాలు ఒక మొత్తంపై ఒప్పందానికి రావడాన్నే సాధారణంగా రుణ సెటిల్‌మెంట్‌ అంటారు. ఒప్పందం ప్రకారం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత రుణ ఖాతాను పరిష్కరించుకోవచ్చు. అయితే సెటిల్‌మెంట్‌ అంటే రుణాన్ని పూర్తిగా చెల్లించడం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనికి రుణగ్రహీత క్రెడిట్‌ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

వివరాలు

బ్యాంకులు తక్కువ మొత్తానికే ఎందుకు అంగీకరిస్తాయి?

భారీ మొత్తంలో బకాయి ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని వదులుకోవడం బ్యాంకుకు నష్టంగా అనిపించవచ్చు.

కానీ రుణం మొత్తం తిరిగి రాబట్టేందుకు పట్టే సమయం, ఖర్చులను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.

రుణగ్రహీత నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసే అవకాశం తక్కువగా ఉంటే.. ఏళ్ల తరబడి కోర్టులు, నోటీసులు, రికవరీ ప్రక్రియల చుట్టూ తిరగడం కంటే ప్రస్తుతం కొంత మొత్తమైనా వసూలు చేసుకోవడం మంచిదని బ్యాంకు భావించవచ్చు.

ఉదాహరణకు రూ.10 లక్షలు బకాయి ఉండి, మొత్తం రికవరీ అవుతుందనే నమ్మకం లేకపోతే.. ప్రస్తుతం రూ.6 లక్షలు చెల్లించేందుకు రుణగ్రహీత సిద్ధంగా ఉంటే, బ్యాంకు ఆ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంటుంది.

వివరాలు

NPAగా మారితే రికవరీ మరింత కష్టం

రుణగ్రహీత వరుసగా 90 రోజుల పాటు రుణ చెల్లింపులు చేయకపోతే.. వర్తించే బ్యాంకింగ్‌ నిబంధనల ప్రకారం ఆ రుణ ఖాతాను సాధారణంగా నిరర్థక ఆస్తి (NPA)గా వర్గీకరిస్తారు.

ఒకసారి రుణం NPAగా మారితే దానిని తిరిగి వసూలు చేయడం మరింత అనిశ్చితంగా మారుతుంది.

అలాంటి పరిస్థితుల్లో ఏళ్ల తరబడి రికవరీ కోసం ఎదురుచూడటం కంటే.. వెంటనే కొంత మొత్తాన్ని వసూలు చేసుకుని ఖాతాను పరిష్కరించుకోవడం మంచిదని బ్యాంకులు భావించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

కోర్టు కేసులు.. అదనపు ఖర్చులు

రుణం రికవరీ ప్రక్రియలో న్యాయవాదుల ఫీజులు, కోర్టు కేసులు, నోటీసులు, రికవరీ ఏజెన్సీల ఖర్చులు తదితరాలు ఉంటాయి.

వీటితోపాటు రికవరీ ప్రక్రియకు చాలా సమయం కూడా పట్టొచ్చు. అందుకే సెటిల్‌మెంట్‌ ద్వారా బ్యాంకుకు కొంత మొత్తాన్ని త్వరగా, ఖచ్చితంగా రాబట్టుకునే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో రికవరీ ప్రక్రియలో అయ్యే కొన్ని అదనపు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

మొండి బకాయిలను తగ్గించుకోవడానికి..

బ్యాంకులు తమ రుణాల నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న రుణ ఖాతాలను పరిష్కరించడం ద్వారా NPAల భారాన్ని తగ్గించుకోవచ్చు.

అలాగే చాలా కాలంగా కొనసాగుతున్న రికవరీ కేసులను కూడా క్లియర్‌ చేసే అవకాశం ఉంటుంది.

రుణగ్రహీత నిజంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా బ్యాంకులు సెటిల్‌మెంట్‌కు అంగీకరించే అవకాశం ఉంటుంది.

ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో భారీ నష్టాలు రావడం లేదా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా రుణాన్ని పూర్తిగా చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో బకాయి మొత్తంలో కనీసం కొంత భాగాన్నైనా తిరిగి రాబట్టుకోవడానికి సెటిల్‌మెంట్‌ ఒక ఆచరణాత్మక మార్గంగా రుణదాత భావించవచ్చు.

వివరాలు

NPA భయం.. కోర్టు ఖర్చులే ప్రధాన కారణాలు

రుణగ్రహీత నిర్ణీత గడువులో వాయిదాలు చెల్లించకపోతే ఆ ఖాతా NPAగా మారే అవకాశం ఉంటుంది.

ఒకసారి రుణం మొండి బకాయిగా మారితే దాన్ని తిరిగి వసూలు చేయడం మరింత కష్టంగా మారుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. ఏళ్ల తరబడి రికవరీ కోసం ప్రయత్నించడం లేదా కొంత మొత్తాన్ని వెంటనే తీసుకుని ఖాతాను పరిష్కరించడం.

కోర్టు కేసులు, న్యాయవాదుల ఫీజులు, రికవరీ ఏజెన్సీల ఖర్చులు, నోటీసులు వంటి ప్రక్రియలకు సమయం, డబ్బు రెండూ అవసరం అవుతాయి.

అందుకే సెటిల్‌మెంట్‌ ద్వారా కొంత మొత్తమైనా త్వరగా రికవర్‌ చేసుకోవడంతోపాటు, తమ బ్యాడ్‌ లోన్ల భారాన్ని తగ్గించుకోవచ్చని బ్యాంకులు భావిస్తాయి.

ADVERTISEMENT