Loading...
Gold and Silver Rates Drop: బంగారం ధర 3.5 శాతం డౌన్‌..వెండి ఏకంగా 14శాతం..అక్టోబరులో ఎందుకీ పతనం..?
బంగారం ధర 3.5 శాతం డౌన్‌..వెండి ఏకంగా 14శాతం..అక్టోబరులో ఎందుకీ పతనం..?

Gold and Silver Rates Drop: బంగారం ధర 3.5 శాతం డౌన్‌..వెండి ఏకంగా 14శాతం..అక్టోబరులో ఎందుకీ పతనం..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం,వెండి కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ముఖ్యంగా దసరా, ధనత్రయోదశి, దీపావళి సమయంలో పసిడికి భారీగా డిమాండ్‌ ఉంటుంది. దీంతో ధరలు కూడా పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్టోబరు నెలలో బంగారం, వెండి ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఒక్క నెలలోనే బంగారం ధర 3.5 శాతం తగ్గగా.. వెండి ధర ఏకంగా 14 శాతం పడిపోయింది. పండగల సీజన్‌లో సాధారణంగా ధరలు పెరుగుతాయని భావించే సమయంలో ఈ స్థాయిలో తగ్గడం మదుపర్లతో పాటు కొనుగోలుదారులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాలు 

హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ తగ్గిన పసిడి,వెండి ధరలు

శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర 0.2 శాతం తగ్గి ఔన్సుకు 3,990 డాలర్ల వద్ద కొనసాగింది.

మరోవైపు వెండి ధర కూడా 0. శాతం తగ్గి 50.98 డాలర్ల స్థాయికి చేరింది. దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.1.42లక్షలుగా నమోదైంది.

సిల్వర్‌ ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర రూ.1.87లక్షల వద్ద కొనసాగింది.

హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. ఉదయం 11.30 గంటల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1.45 లక్షలుగా నమోదైంది.

కిలో వెండి ధర రూ.1.89 లక్షలకు దిగొచ్చింది. ఒక్కరోజులోనే వెండి ధర దాదాపు రూ.5 వేలు తగ్గడం గమనార్హం.

వివరాలు 

బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలేంటి?

అమెరికా బాండ్లపై పెరుగుతున్న రాబడులు:

అమెరికా ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలాలు (యీల్డ్స్‌) భారీగా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులను తగ్గించి, బాండ్ల వైపు మళ్లుతున్నారు.

సాధారణంగా బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు బంగారం వంటి రాబడి ఇవ్వని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది.

మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబరులోనూ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

బలపడుతున్న అమెరికా డాలర్‌:

డాలర్‌ విలువ పెరగడం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు మరో కారణంగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రెండు లోహాల లావాదేవీలు ప్రధానంగా డాలర్లలోనే జరుగుతాయి.

డాలర్‌ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం, వెండి కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం ధరలపై పడుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు:

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 112 డాలర్ల వద్ద ఉంది. ఇంధన ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే సెప్టెంబరులో అమెరికా ద్రవ్యోల్బణ రేటు 3.7 శాతానికి చేరింది. త్వరలోనే అమెరికా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి.

వివరాలు 

చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు:

ఈ నేపథ్యంలో మార్కెట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోనని మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

అమెరికా బాండ్లపై పెరుగుతున్న రాబడులు, డాలర్‌ బలోపేతం, చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై నెలకొన్న ఆందోళనలు.. ఇలా పలు అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఫలితంగా పండగల సీజన్‌లోనూ ఈ రెండు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ADVERTISEMENT