Rare-earth metal: భారతదేశం ఈ అరుదైన-భూమి లోహం ఉత్పత్తిని ఎందుకు పెంచాలనుకుంటుంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం అరుదైన లోహాల ఉత్పత్తి పెంచే దిశగా కొత్త అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, శుద్ధ శక్తి సాంకేతికతలు, రక్షణ రంగంలో కీలకంగా ఉపయోగించే నియోడీమియం (Neodymium) లోహం ఉత్పత్తిని భారీగా పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో సంవత్సరానికి కేవలం 40 టన్నుల నియోడీమియం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అయితే FY27 చివరికల్లా దాదాపు 500 టన్నుల వరకు — అంటే తొమ్మిది రెట్లు — ఉత్పత్తి పెంచాలని లక్ష్యం. ఈ విస్తరణకు కేంద్ర అణుశక్తి శాఖ ఆధీనంలోని ప్రభుత్వ సంస్థ IREL (Indian Rare Earths Limited) నాయకత్వం వహిస్తోంది.
వివరాలు
నియోడైమియం ప్రాముఖ్యత,ఉత్పత్తి లక్ష్యాలు
IREL రేర్-అర్థ్ విభాగం GM వీ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, నియోడీమియంతో పాటు ప్రాసియోడీమియం వంటి లోహాలకు దేశీయ పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉందని, వచ్చే ఏడాదికల్లా ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని తెలిపారు. ఒడిశాలోని ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్, కేరళలోని రిఫైనింగ్ యూనిట్ ద్వారా ప్రస్తుతం 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో 8 రకాల్ని భారత్ ఉత్పత్తి చేస్తోంది.
వివరాలు
ఉత్పత్తిని పెంచడానికి IREL నిబద్ధత
ప్రస్తుతం ప్రపంచ రేర్ ఎర్త్ మార్కెట్‌లో చైనా 44% మార్కెట్ షేర్తో, మొత్తం ఉత్పత్తిలో 90% వాటాతో ఆధిపత్యం చాటుతోంది. భారత్ వద్ద ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచేంత రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, ఉత్పత్తి మాత్రం కేవలం 5-6% వరకు మాత్రమే ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు IREL ఇప్పుడు దేశీయ రక్షణ, అణుశక్తి అవసరాల కోసం సమారియం-కోబాల్ట్ అయస్కాంతాల (REPM) ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది.
వివారాలు
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ తో అలైన్‌మెంట్
ఈ ప్రయత్నాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ మిషన్ కింద 2025 నుండి 2031 వరకు ₹16,300 కోట్లు ప్రభుత్వ వ్యయం, అదనంగా ₹18,000 కోట్లు PSUలు, ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టనున్నారు. దీని లక్ష్యం అవసరమైన చురుకైన లోహాల సరఫరా శృంఖలాన్ని.. అన్వేషణ నుంచి శోధన, శుద్ధి, రీసైక్లింగ్ వరకు.. దేశంలోనే బలపరచడం.