
Gold Rates: గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు.. ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో బంగారం ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానిని కేవలం ఆభరణంగా కాకుండా, ఒక రకమైన ఆర్థిక భద్రతగా కూడా ప్రజలు భావిస్తారు. అందుకే మన దేశంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే కొనుగోలు చేసే ముందు ప్రజలు ధరల్లో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనిస్తారు. ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు ఆల్ టైం హయ్యెస్ట్ కు చేరుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తగ్గుతాయి కూడా. మరి ఈ మార్పులకు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
#1
కరెన్సీ మార్పిడి
బంగారం ధరలు మారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కరెన్సీ ఎక్స్‌ఛేంజ్. ప్రపంచ వ్యాప్తంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దాని ప్రభావం నేరుగా దేశీయ బంగారం ధరలపై పడుతుంది. #2ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు స్టాక్స్ కన్నా సురక్షితమైన ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి, ధరలు పెరిగే అవకాశముంటుంది.
#3
యుద్ధాలు,రాజకీయ ఉద్రిక్తతలు
ఏదైనా దేశంలో యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు లేదా అంతర్జాతీయ వివాదాలు చోటుచేసుకున్నప్పుడు, ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం తగ్గుతుంది. దాని ప్రభావం బంగారం ధరలపై తక్షణమే కనిపిస్తుంది. #4ద్రవ్యోల్బణం (Inflation) ద్రవ్యోల్బణం పెరిగితే, కరెన్సీ విలువ తగ్గుతుంది. కానీ బంగారం ఒక అంతర్జాతీయ విలువ కలిగిన సంపద కాబట్టి దాని ప్రాధాన్యం తగ్గదు. అందువల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగినప్పుడు బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. #5వడ్డీ రేట్లు ప్రభుత్వాలు లేదా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తే, అది బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. కొత్త పన్ను విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
#6
డిమాండ్
బంగారం డిమాండ్ పెరిగితే, ధరలు స్వయంగా పెరుగుతాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుందని, ఆ సమయంలో ధరలు కూడా పెరగడం సాధారణమే. #7ప్రొడక్షన్ కాస్ట్ బంగారాన్ని తవ్వడం, శుద్ధి చేయడం లేదా బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఖర్చులు పెరిగితే, ధరలపై ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ, మెషినరీ ఖర్చులు ఎక్కువైనా గోల్డ్ రేట్లు పెరగడం తప్పదు.