LOADING...
Tata steel: టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్ ఎన్జీవో దావా
టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్ ఎన్జీవో దావా

Tata steel: టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్ ఎన్జీవో దావా

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది. నెదర్లాండ్స్‌లో కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడిందని, పర్యావరణానికి నష్టం కలిగిందని ఆరోపిస్తూ ఈ దావా దాఖలైంది. దీనికి పరిహారంగా 1.6 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.14,370 కోట్లను చెల్లించాలని హోర్లెం పట్టణంలోని నార్త్ హోలెండ్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని టాటా స్టీల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

ఆరోపణలకు మద్దతుగా సరైన ఆధారాలను ఎన్జీవో సమర్పించదు: టాటా స్టీల్

వెల్సన్-నూర్డ్ ప్రాంతంలో టాటా స్టీల్ ఐజ్మెయిడన్ బీవీ యూనిట్ నుంచి వెలువడుతున్న కాలుష్య పదార్థాల కారణంగా అక్కడి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆ ఎన్జీవో కేసు వేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కాలుష్యం వల్ల స్థానికులు తమ ఇళ్లలో సుఖంగా గడపలేకపోతున్నారని, వారి ఆస్తుల విలువలు కూడా తగ్గిపోయాయని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే, ఈ ఆరోపణలకు మద్దతుగా సరైన ఆధారాలను ఎన్జీవో సమర్పించలేదని టాటా స్టీల్ స్పష్టం చేసింది. తన వాదనలకు అనుకూలంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

వివరాలు 

పరిహారం అనే ప్రశ్న ఇప్పటికిప్పుడు ఉత్పన్నం కాదు 

ఈ కేసు విచారణ రెండు దశల్లో జరుగుతుందని, ప్రతి దశ పూర్తవడానికి కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని టాటా స్టీల్ తెలిపింది. అందువల్ల ప్రస్తుతం పరిహారం చెల్లించే అంశం తక్షణమే వచ్చే ప్రశ్న కాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు డచ్ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే అవసరమైన చర్యలను ప్రారంభించామని కంపెనీ వెల్లడించింది.

Advertisement