AI start-up: మ్యూజిక్ ఇండస్ట్రీలో AI ప్రభావం పెరుగుతోంది: లీడింగ్ లేబుల్స్ కొత్త అడుగు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్ ఇప్పుడు ఒక AI స్టార్ట్‌అప్ వైపు మొగ్గు చూపడం ఇండస్ట్రీలో నూతన మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్లే విజన్ అనే కంపెనీతో సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్‌మెంట్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌లు వేర్వేరు AI లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గురువారం వార్నర్ వారి వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెల్లడించగా, మ్యూజిక్ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వేగంగా పెరుగుతోందని ఇది స్పష్టంచేస్తోంది. అయితే ఒప్పందాల పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, అభిమానుల కోసం కొత్త తరహా మ్యూజిక్ అనుభవాలను తీసుకురావడానికి ఈ భాగస్వామ్యాలు దోహదం చేస్తాయని క్లే తెలిపింది.
వివరాలు
వార్నర్, యూనివర్సల్, సోనీ కేసులు
కళాకారులు, సాంగ్‌రైటర్లు, రైట్స్ హోల్డర్ల హక్కులను గౌరవించేలా AI ఆధారిత మ్యూజిక్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని, అంతేకాక పూర్తిగా లైసెన్స్డ్ మ్యూజిక్‌తోనే ట్రెయిన్ చేసిన పెద్ద మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే,చాట్‌బాట్‌లా పాటలు సృష్టించే టూల్స్ పెరగడంతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో AI-జనరేట్‌డ్ సంగీతం విపరీతంగా పెరిగింది. వాస్తవంలో లేని వర్చువల్ సింగర్లు, బ్యాండ్లు కూడా చార్ట్‌లను షేక్ చేస్తున్నాయి. గత ఏడాది సునో, ఉడియో ప్లాట్‌ఫారమ్‌లు కళాకారుల పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో వార్నర్, యూనివర్సల్, సోనీ కేసులు వేశాయి. అయితే ఇప్పుడు ఈ వివాదాలు చర్చల దశలో పరిష్కారం అవుతున్నాయి.
వివరాలు
యూజర్లు ప్రముఖ గాయకుల పాటలను రీమిక్స్ చేసుకోవచ్చు
శీరన్, దువా లిపా వంటి కళాకారులున్న వార్నర్ తాజాగా ఉడియోపై వేసిన కేసును విరమించుకుని, 2026లో లైసెన్స్డ్ AI మ్యూజిక్ క్రియేషన్ సర్వీస్‌ను కలిసి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా యూజర్లు ప్రముఖ గాయకుల పాటలను రీమిక్స్ చేసుకోవచ్చు. కళాకారులు, సాంగ్‌రైటర్లకు కొత్త రెవెన్యూ మార్గాలు కూడా లభించనున్నాయి. మరోవైపు యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ కూడా గత నెలలో ఉడియోతో ఇలాంటి ఒప్పందమే చేసుకుంది.
వివరాలు
కొత్త సర్వీసు కోసం ఉడియో
అయితే యూజర్లు సృష్టించిన పాటలను డౌన్‌లోడ్ చేయకుండా ఉండే విధానం విమర్శలకు దారితీసింది. అయినా రానున్న ఏడాది కొత్త సర్వీసు కోసం ఉడియోను "క్లోజ్డ్ సిస్టమ్"గానే కొనసాగించనున్నారు. కళాకారులు, సాంగ్‌రైటర్లు తమ పనిని ప్లాట్‌ఫారమ్‌లో ఉపయోగించడానికి అంగీకరిస్తే, వారు రూపొందించిన పాటలు రీమిక్స్ అవుతున్నప్పుడు, కవర్ చేస్తున్నప్పుడు లేదా వారి వాయిస్, కంపోజిషన్‌తో కొత్త ట్యూన్లు తయారవుతున్నప్పుడు వారికి సరైన క్రెడిట్, పారితోషికం అందేలా వ్యవస్థ ఉండనుంది.