Loading...
EPF Account: మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?
మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?

EPF Account: మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగ జీవితంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సహజమే. ఉద్యోగం మారిన ప్రతిసారీ యూఏఎన్‌ (UAN) ఒకటే ఉన్నప్పటికీ.. కొత్త యాజమాన్యం కింద కొత్త ఈపీఎఫ్‌ ఖాతా జనరేట్‌ అవుతుంది. అయితే చాలామంది పాత ఈపీఎఫ్‌ ఖాతాలను కొత్త ఖాతాతో విలీనం చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. మీకూ ఇలాంటి ఖాతాలు ఉంటే వాటిని మెర్జ్‌ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పీఎఫ్‌ నిర్వహణ సులభం కావడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఖాతా నిర్వహణ సులభం: ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్‌ ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాకు బదిలీ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే మీ రిటైర్మెంట్‌ పొదుపు మొత్తం ఒకే ఖాతాలో ఉంటుంది.

వివరాలు

సర్వీస్‌ హిస్టరీ కొనసాగింపు..

పీఎఫ్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగం మారినప్పటికీ సర్వీస్‌ కంటిన్యుటీ ఉండటం ముఖ్యం.

ముఖ్యంగా ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయితే పీఎఫ్‌ విత్‌డ్రా సమయంలో కొన్ని పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.

పాత పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేయడం ద్వారా సర్వీస్‌ హిస్టరీ కొనసాగుతుంది.

ఐదేళ్ల సర్వీస్‌ పూర్తికాకముందే పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేస్తే మూలం వద్ద పన్ను కోత (TDS) పడే అవకాశం ఉంటుంది.

ఖాతాలను విలీనం చేయడం వల్ల సర్వీస్‌ కంటిన్యుటీని కొనసాగించుకోవచ్చు.

వివరాలు

ఈపీఎఫ్‌ ఖాతాలను ఎలా మెర్జ్‌ చేయాలి?

ముందుగా ఈపీఎఫ్‌ఓ మెంబర్‌ సేవా పోర్టల్‌ను ఓపెన్‌ చేసి మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.

అనంతరం 'వన్‌ మెంబర్‌-వన్‌ ఈపీఎఫ్‌ అకౌంట్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

వాటిని ఒకసారి పరిశీలించి ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత మీ పాత ఈపీఎఫ్‌ ఖాతాలను ఒకే ఖాతాలోకి తీసుకురావడానికి అవసరమైన యూఏఎన్‌ వివరాలను నమోదు చేయాలి.

అనంతరం మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP)ను ఎంటర్‌ చేయాలి.

దీంతో వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు పంపిన మెర్జ్‌ రిక్వెస్ట్‌కు ప్రస్తుత ఎంప్లాయర్‌ ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

ఎంప్లాయర్‌ నుంచి ఆమోదం..

ఎంప్లాయర్‌ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌ఓ మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్‌ చేస్తుంది.

ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత ఈపీఎఫ్‌ ఖాతాల్లో ఉన్న నగదు కొత్త ఖాతాలోకి బదిలీ అయి ఒకే ఖాతాలో కనిపిస్తుంది.

సెటిల్‌మెంట్‌ సులభం: రిటైర్మెంట్‌ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చినప్పుడు నిధులు ఒకే ఖాతాలో ఉంటే ప్రక్రియ సులభంగా ఉంటుంది.

వేర్వేరు ఖాతాల్లో ఉన్న డబ్బును విడివిడిగా విత్‌డ్రా చేయాల్సిన అవసరం ఉండదు.

ADVERTISEMENT