LOADING...
UPI Users: ఆటో పే వల్ల ఖాతా ఖాళీ అవుతుందా?.. వెంటనే ఇలా చెక్ చేసి క్యాన్సిల్ చేయండి!
ఆటో పే వల్ల ఖాతా ఖాళీ అవుతుందా?.. వెంటనే ఇలా చెక్ చేసి క్యాన్సిల్ చేయండి!

UPI Users: ఆటో పే వల్ల ఖాతా ఖాళీ అవుతుందా?.. వెంటనే ఇలా చెక్ చేసి క్యాన్సిల్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్‌లను వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు సమస్య ఏమిటి? మనలో చాలా మంది ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు, యాప్ సేవలు లేదా ఇతర రెగ్యులర్ పేమెంట్ల కోసం 'ఆటో పే' (Auto-pay) ఆప్షన్‌ను యాక్టివేట్ చేస్తుంటారు. అయితే తర్వాత వాటిని రద్దు చేయడం మర్చిపోతారు. దీంతో ప్రతి నెలా లేదా సంవత్సరం పూర్తయ్యే సరికి, మన అనుమతి లేకుండానే డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతూ ఉంటాయి.

వివరాలు

ఆటో పే మాండేట్‌లను ఎలా చెక్ చేసి క్యాన్సిల్ చేయాలి?

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని, అన్ని యూపీఐ యాప్‌లలో మీరు సెట్ చేసిన ఆటో పే మాండేట్‌లను ఒకే చోట చెక్ చేసి, అవసరం లేనివి రద్దు చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా యూపీఐ అధికారిక వెబ్‌సైట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (upihelp.npci.org.in)ను ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. 'Show My Auto-pay Mandates'అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యూపీఐ ఐడికి లింక్ అయిన అన్ని ఆటో పే మాండేట్‌ల జాబితా కనిపిస్తుంది. అవసరం లేని వాటిని 'Pause' చేయండి లేదా పూర్తిగా 'Revoke' (క్యాన్సిల్) చేయండి.

వివరాలు

దీని వల్ల ప్రయోజనం ఏమిటి?

అనవసరమైన ఆటో పేమెంట్లను నిలిపివేయడం ద్వారా మీ డబ్బును సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఖాతా నుంచి అనుకోకుండా డబ్బులు కట్ అవకుండా నియంత్రణ మీ చేతుల్లో ఉంటుంది.

Advertisement