Fact check: ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఎస్‌బీఐ యోనో బ్లాక్ అవుతుందా? బ్యాంక్ క్లారిటీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య అలర్ట్. అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు కొత్త పన్నాగాలకు తెరలేపారు. ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు ప్రతిరోజూ వేర్వేరు మార్గాల్లో ప్రయత్నిస్తున్న ఈ మోసగాళ్లు ఇప్పుడు ఎస్‌బీఐ (State Bank of India) పేరిట నకిలీ సందేశాలను సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుతున్నారు.
Details
నకిలీ APK ఫైళ్లతో మోసం
ఎస్‌బీఐ పేరుతో పంపిన సందేశాల్లో ఓ APK ఫైల్‌ను పంపిస్తూ, దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. అందులో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలని, లేదంటే ఎస్‌బీఐ యోనో (SBI YONO APP) యాప్ బ్లాక్ అవుతుందని బెదిరింపులు చేస్తున్నారు. ఈ సందేశాలన్నీ పూర్తిగా నకిలీవని కేంద్రం స్పష్టం చేసింది.
Details
కేంద్ర ఫ్యాక్ట్‌చెక్ విభాగం హెచ్చరిక
పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్'లో పోస్టు చేస్తూ- ఇవి పూర్తిగా నకిలీ సందేశాలని, ఎవరూ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దని, ఆధార్, బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని హెచ్చరించింది. అలాగే, ఇలాంటి సందేశాలు అందితే వెంటనే [pishing@sbi.co.in](mailto:pishing@sbi.co.in)కు రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరింది.
Details
ఎస్‌బీఐ ప్రత్యేక సూచనలు
బ్యాంకు కూడా ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. క్లిక్ చేసే ముందు ఆలోచించండి, బ్యాంకింగ్ యాప్ అప్‌డేట్ పేరుతో పంపే APK లింకులు పూర్తిగా స్కామ్, అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు, డౌన్‌లోడ్ చేయొద్దు, అప్‌డేట్ చేయొద్దని స్పష్టం చేసింది. యాప్‌లను కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేయాలని సూచించింది. ఏదైనా సైబర్ మోసాలపై వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.