Loading...
Wipro's new bench policy:ఐటీ ఉద్యోగులకు విప్రో గుడ్‌న్యూస్‌.. బెంచ్‌ సమయం 180 రోజులకు పెంపు
ఐటీ ఉద్యోగులకు విప్రో గుడ్‌న్యూస్‌.. బెంచ్‌ సమయం 180 రోజులకు పెంపు

Wipro's new bench policy:ఐటీ ఉద్యోగులకు విప్రో గుడ్‌న్యూస్‌.. బెంచ్‌ సమయం 180 రోజులకు పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల బెంచ్‌ సమయాన్ని తగ్గిస్తున్న వేళ.. విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు కేటాయింపు లేకుండా సంస్థలో కొనసాగుతున్న ఉద్యోగులకు బెంచ్‌పై ఉండే గడువును పెంచింది. అక్టోబరు 1 నుంచి బ్యాండ్‌ 2, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న జూనియర్‌, మిడ్‌-లెవల్‌ ఉద్యోగులు గరిష్ఠంగా ఆరు నెలలు.. అంటే 180 క్యాలెండర్‌ రోజుల వరకు బెంచ్‌పై కొనసాగేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఉద్యోగి బిల్‌ చేయదగిన ప్రాజెక్టు నుంచి విడుదలైన తేదీ నుంచి ఈ 180రోజుల వ్యవధిని లెక్కిస్తారు. అలాగే,మరో బిల్‌ చేయదగిన ప్రాజెక్టుకు కేటాయించకుండా ఆన్‌సైట్‌ అసైన్‌మెంట్‌ పూర్తిచేసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తేదీ నుంచి కూడా ఈ గడువు వర్తిస్తుంది.

వివరాలు 

ఫ్రెషర్లకు బదులుగా అనుభవజ్ఞులనే తిరిగి వాడుకునే యోచన

ఈ వ్యవధిలో ప్రాజెక్టు లభించని బ్యాండ్‌ 2 లేదా అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులపై కంపెనీ ఉద్యోగ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అవసరమైతే ఉద్యోగాన్ని కూడా తొలగించవచ్చు. నైపుణ్యాలు ఉన్నప్పటికీ వివిధ కారణాలతో బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను వెంటనే కోల్పోకుండా ఉండేందుకు విప్రో తాజా నిర్ణయం ఉపయోగపడే అవకాశం ఉంది.

భవిష్యత్తులో ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇప్పటికే సంస్థలో ఉన్న అనుభవజ్ఞులైన ఉద్యోగులను తిరిగి వినియోగించుకునేందుకు ఇది దోహదపడుతుంది.

ముఖ్యంగా ఇటీవలి త్రైమాసికాల్లో ఫ్రెషర్ల నియామకాలు పెద్దగా చేపట్టని నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న అనుభవజ్ఞులైన సిబ్బంది వినియోగాన్ని పెంచుకోవడానికి ఈ విధానం ఉపయోగపడొచ్చు.

వివరాలు 

ఫ్రెషర్లకు బదులుగా అనుభవజ్ఞులనే తిరిగి వాడుకునే యోచన

బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు ఈ సమయంలో కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు.. వారి సామర్థ్యాలకు సరిపోయే ప్రాజెక్టులకు బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుంది.

కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం తగ్గడం వల్ల.. కంపెనీలకు సమయం, శిక్షణ ఖర్చులు రెండూ ఆదా కావచ్చు.

అయితే విప్రో ప్రవేశపెట్టిన 'ఎక్స్‌టెండెడ్‌ బెంచ్‌ లీవ్‌ ప్రోగ్రామ్‌'ను కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై కొందరు కార్మిక కమిషనర్‌ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇతర ఐటీ కంపెనీల్లో పరిస్థితి..

మరోవైపు.. దేశంలోని ఇతర పెద్ద ఐటీ కంపెనీలు బెంచ్‌ సమయాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి.

కొన్ని సంస్థలు ఈ గడువును 60 రోజుల కంటే తక్కువకు కూడా పరిమితం చేశాయి.

టీసీఎస్‌ సవరించిన అసోసియేట్‌ డెప్లాయ్‌మెంట్‌ పాలసీ ప్రకారం.. ప్రతి ఉద్యోగి ఏడాదిలో కనీసం 225 రోజులు బిల్‌ చేయదగిన పనిలో ఉండాలి.

ఈ విధానం ప్రకారం బెంచ్‌పై ఉండే గరిష్ఠ సమయం 35 పనిదినాలకు పరిమితమవుతుంది.

కాగ్నిజెంట్‌ కూడా దాదాపు ఆరు సంవత్సరాల క్రితమే బిల్‌ చేయదగిన ప్రాజెక్టు లేని ఉద్యోగుల బెంచ్‌ సమయాన్ని 60 రోజుల నుంచి 35 రోజులకు తగ్గించింది.

దీంతో పలు సంస్థల్లో ప్రాజెక్టు కేటాయింపు లేకుండా ఉద్యోగులు కొనసాగే వ్యవధి తగ్గుతూ వస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

సాధారణంగా బెంచ్‌పై ఎంతకాలం ఉంచుతారు?

ఒక ప్రముఖ ఐటీ కంపెనీ మాజీ ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కొత్త అసైన్‌మెంట్‌ లభించని ఉద్యోగులను ఆయా కంపెనీల విధానాలకు అనుగుణంగా సాధారణంగా సుమారు 45 రోజుల వరకు బెంచ్‌పై ఉంచుతారు.

ఈ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనం కొనసాగుతుంది. ఉద్యోగి కొత్త ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తూనే సంస్థలో కొనసాగుతారు.

నిర్దేశించిన గడువులోగా కొత్త ప్రాజెక్టు లభించకపోతే.. ఉద్యోగి రాజీనామా చేయవచ్చు. లేదా కంపెనీ అందించే ఈబీఎల్‌పీ (Extended Bench Leave Programme)ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

సాధారణంగా బెంచ్‌పై ఎంతకాలం ఉంచుతారు?

ఈ కార్యక్రమం తొలుత 90 రోజుల పాటు కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి మరో 30 రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది.

అయితే ఈబీఎల్‌పీ సాధారణ బెంచ్‌ పీరియడ్‌కు భిన్నంగా ఉంటుంది.

ఇది జీతం లేని విరామకాలం కావడంతో ఈ సమయంలో ఉద్యోగికి వేతనం అందదు. అలాగే పీఎఫ్‌ చెల్లింపులు కూడా నిలిచిపోతాయి.

అయితే ఈబీఎల్‌పీ సమయంలో ఉద్యోగికి కొత్త ప్రాజెక్టు లభిస్తే.. కంపెనీ ఆ ప్రాజెక్టును అతడికి లేదా ఆమెకు కేటాయించే అవకాశం ఉంటుంది.

ప్రాజెక్టు కేటాయింపు జరిగిన తర్వాత వేతన చెల్లింపులు తిరిగి ప్రారంభమవుతాయి.

ADVERTISEMENT