
World's richest man: ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌ను అధిగమించిన ఆర్నాల్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించాడు.
ఫోర్బ్స్ ప్రకారం, గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ LVMH(లూయిస్ విట్టన్) వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.
ఆర్నాల్ట్ కుటుంబం మొత్తం సంపద శుక్రవారం నాటికి 23.6బిలియన్ డాలర్లు పెరిగి 207.8బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మరోవైపు, మస్క్ సంపద $18బిలియన్లకు పైగా తగ్గి $204.5బిలియన్లకు చేరుకుంది.
'టెస్లా 'షేర్ల పతనం కారణంగానే మస్క్ నికర విలువ భారీ తగ్గినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
ఈ ఏడాది ఇప్పటివరకు టెస్లా స్టాక్ 26శాతానికి పైగా పడిపోయింది. అదే సమయంలో ఆర్నాల్ట్ కంపెనీ LVMH షేర్లు ఈ సంవత్సరం ఇప్పటివరకు 7శాతం పెరిగాయి.
మస్క్
11వ స్థానంలో ముఖేష్ అంబానీ
జెఫ్ బెజోస్ మూడో స్థానం, లారీ ఎలిసన్ నాలుగో స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాలో వారెన్ బఫెట్ ఆరో స్థానంలో, లారీ పేజ్ ఏడో స్థానంలో ఉన్నారు.
బిల్ గేట్స్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. అదే సమయంలో సెర్గీ బ్రిన్ తొమ్మిదో స్థానం, స్టీవ్ బాల్మెర్ 10వ స్థానంలో ఉన్నారు.
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ $104.4 బిలియన్ల నికర విలువతో 11వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా, ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.
అలాగే అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ $75.7 బిలియన్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.