LOADING...
Year-ender 2025: 2025లో స్టార్టప్ ఇండియా కింద 2లక్షల మార్క్ దాటిన స్టార్టప్స్.. ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు
ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు

Year-ender 2025: 2025లో స్టార్టప్ ఇండియా కింద 2లక్షల మార్క్ దాటిన స్టార్టప్స్.. ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లో భారతదేశ స్టార్టప్ రంగం వేగంగా ముందుకు సాగుతోంది. సంఖ్యలు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా కీలక మైలురాళ్లు దాటుతోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా నమోదైన స్టార్టప్స్ సంఖ్య 2,01,000కు పైగా చేరింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షలకు మించిన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దీంతో స్టార్టప్స్ ఉపాధి కల్పనకు, ఆర్థిక చలనం పెంచడానికి ప్రధాన శక్తిగా మారాయి.

వివరాలు 

దశాబ్దకాల పాలసీ మద్దతు ఫలితం

2025లో కనిపిస్తున్న ఈ వృద్ధి వెనుక దాదాపు పదేళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన పాలసీ మద్దతు ఉంది. స్టార్టప్ ఇండియా ప్రారంభమైనప్పుడు కేవలం కొన్ని వందల కంపెనీలే గుర్తింపు పొందాయి. అయితే, క్రమంగా నియమ నిబంధనలు సులభతరం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆలోచనలకు ఊతం ఇవ్వడం వల్ల ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2025లో స్టార్టప్స్ సంఖ్యలో భారీ పెరుగుదల ఈ ఏడాది మాత్రమే 44,000కు పైగా కొత్త స్టార్టప్స్ DPIIT వద్ద రిజిస్టర్ అయ్యాయని కేంద్రం తెలిపింది. ఇది స్టార్టప్ ఇండియా ప్రారంభమైన తర్వాత ఒకే ఏడాదిలో నమోదైన అత్యధిక సంఖ్యగా చెప్పవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఆవిష్కరణల పునాది మరింత బలపడుతోందనే సంకేతంగా భావిస్తున్నారు.

వివరాలు 

పెద్ద నగరాలకే పరిమితం కాని స్టార్టప్ వృద్ధి

స్టార్టప్ కార్యకలాపాలు ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఇప్పటికీ ముందంజలో ఉన్నప్పటికీ, చిన్న పట్టణాలు, జిల్లాల్లో కూడా స్టార్టప్స్ సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ మద్దతు: పథకాలు, నిధులు, మౌలిక వసతులు స్టార్టప్ రంగాన్ని పెంచడంలో ప్రభుత్వ పాత్ర కీలకంగా ఉంది. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్స్‌కు ప్రోటోటైప్స్, ఉత్పత్తుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (FFS) ద్వారా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారా పెద్ద స్థాయిలో పెట్టుబడులు అందుతున్నాయి.

Advertisement

వివరాలు 

లోన్లకు గ్యారంటీ స్కీమ్ తో ఊరట

స్టార్టప్స్‌కు లోన్లు సులభంగా అందేందుకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (CGSS)అమలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో కొత్త కంపెనీలకు ఫండింగ్ అడ్డంకులు తగ్గుతున్నాయి. ఇంక్యూబేషన్, మెంటారింగ్‌కు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM)వంటి సంస్థలు ఇంక్యూబేషన్, మెంటారింగ్, ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులను అవసరమైన వనరులతో అనుసంధానం చేస్తున్నాయి. స్పేస్ టెక్ వంటి రంగాలకు ప్రత్యేక మద్దతు కొన్ని రంగాలకు ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2025లో స్పేస్ టెక్ స్టార్టప్స్‌కు ₹211 కోట్ల పెట్టుబడిని FFS పథకం ద్వారా ప్రకటించింది. దీని వల్ల కొత్త సాంకేతిక రంగాల్లో భారత స్టార్టప్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశాలు పెరిగాయి.

Advertisement

వివరాలు 

యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు

స్టార్టప్స్ ఇప్పుడు యువతకు ప్రధాన ఉపాధి వనరుగా మారాయి. టెక్నాలజీ, సర్వీసులే కాకుండా స్పేస్ టెక్, డీప్ టెక్, డిజిటల్ ప్లాట్‌ఫాంల వంటి కొత్త రంగాల్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పటివరకు సృష్టించిన 21 లక్షల ఉద్యోగాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. యువత ఆలోచనల్లో మార్పు యువతలో వ్యాపార ఆలోచనలపై దృష్టి పెరుగుతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి ప్రత్యామ్నాయంగా భావించిన స్టార్టప్ ఇప్పుడు మొదటి ఎంపికగా మారుతోంది. ప్రభుత్వ గుర్తింపులు, అవార్డులు, టెక్ ఈవెంట్స్ వల్ల విజయ కథలు వెలుగులోకి వస్తూ మరింత మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి.

వివరాలు 

చిన్న పట్టణాలకు కూడా స్టార్టప్ వృద్ధి

స్టార్టప్ అభివృద్ధి పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) వంటి కార్యక్రమాల ద్వారా మెట్రోలకు బయట ఉన్న స్టార్టప్స్‌కు కూడా గుర్తింపు, వనరులు అందుతున్నాయి. పలు రాష్ట్రాలు తమ సొంత స్టార్టప్ పాలసీలను కూడా అమలు చేస్తున్నాయి. భవిష్యత్తులో స్టార్టప్స్ దిశ ఇదే ముందు రోజుల్లో స్టార్టప్స్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు తీసుకురానుంది. డిజిటల్ మౌలిక వసతులు, ఫైనాన్సింగ్, ఇంక్యూబేషన్ నెట్‌వర్క్స్, నియంత్రణల సరళీకరణపై దృష్టి కొనసాగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్, డీప్ టెక్ వంటి రంగాల్లో అవకాశాలు మరింత పెరగనున్నాయి.

వివరాలు 

భారత్ భవిష్యత్తుకు స్టార్టప్స్ కీలకం

ఉద్యోగాలు సృష్టించడం, ఆవిష్కరణలకు దారితీయడం,పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్టార్టప్స్ భారత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాలసీ మద్దతు కొనసాగితే, రాబోయే దశాబ్దాల్లో భారత్ అభివృద్ధిని నిర్ణయించే శక్తిగా స్టార్టప్ రంగం మారనుంది.

Advertisement