Page Loader
ITR: మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈసారి పన్ను రీఫండ్ ఆలస్యం కావొచ్చు! 
మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈసారి పన్ను రీఫండ్ ఆలస్యం కావొచ్చు!

ITR: మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈసారి పన్ను రీఫండ్ ఆలస్యం కావొచ్చు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు చివరి గడువు సెప్టెంబర్ 15, 2025గా నిర్దేశించారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే, తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ పరిధిలోకి వస్తే, ఈ ఏడాది కోసం ఐటీఆర్ దాఖలుపై దృష్టి పెట్టాలి. అయితే ఈసారి రీఫండ్ అందడంలో ఆలస్యం సంభవించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనుక కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.

వివరాలు 

ఆమోఘంగా డేటా పరిశీలన 

ఈఏడాది ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్‌కు సంబంధించిన వివరాలను మరింత నిశితంగా పరిశీలిస్తోంది. దాఖలు చేసే సమాచారం సరిగ్గా ఉండాలనే కఠినంగా చూస్తోంది. ఏవైనా తప్పుడు డిటైల్స్ ఇచ్చినట్లయితే,సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈసారి రిటర్న్ల ప్రాసెసింగ్ ఆలస్యం కావడం ఆశ్చర్యకరం కాదు. అధిక రీఫండ్ క్లెయిమ్‌లపై ప్రత్యేక దృష్టి చెల్లింపుదారులుఎలాంటి ఐటీఆర్ ఫారమ్ ఉపయోగించారన్నదాన్ని పన్నుశాఖ పరిశీలిస్తోంది. సాధారణంగా ఐటీఆర్-1,ఐటీఆర్-4 వంటి ఫారమ్‌లు వేగంగా ప్రాసెస్ అవుతాయి. అయితే ఐటీఆర్-2,ఐటీఆర్-3 వంటివి సమగ్ర సమాచారం అవసరం అయ్యే ఫారమ్‌లు కావడంతో అవి ఆలస్యంగా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాక,అధిక మొత్తంలో రీఫండ్ క్లెయిమ్ చేసిన వారిపై శాఖ మరింత కఠినంగా తనిఖీలు నిర్వహిస్తోంది.

వివరాలు 

వడ్డీ చెల్లింపు ఎలా లభిస్తుంది? 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 244A ప్రకారం, రీఫండ్ ఆలస్యమైనప్పుడు నెలకు 0.5 శాతం వడ్డీ చెల్లించబడుతుంది. ఈ వడ్డీ లెక్కింపును రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచీ లేదా సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తేదీ నుంచీ మొదలు పెట్టి లెక్కిస్తారు. కానీ ఇది కేవలం మీరు మొత్తం చెల్లించిన పన్నులో 10 శాతం కంటే ఎక్కువ రీఫండ్ కావాలన్న షరతుతో మాత్రమే వర్తిస్తుంది.

వివరాలు 

ఈ తప్పులు చేయొద్దు 

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయానికి సరిపడని ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోరాదు. ఉదాహరణకు, మూలధన లాభాలు లేదా అద్దె ఆదాయం ఉన్నా ఐటీఆర్-1 ఫారమ్ ఎంచుకుంటే, సెక్షన్ 139(9) ప్రకారం తప్పులున్న రిటర్నుగా పరిగణించబడి నోటీసు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫారమ్‌-26AS లేదా టీడీఎస్ స్టేట్‌మెంట్‌లో తేడాలు ఉంటే కూడా నోటీసులు రావచ్చు. పన్ను శాఖ నుంచి ఏదైనా నోటీసు వచ్చినట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గడువులను పాటించకపోతే, చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు.