Nifty Microcap 250 index:అధిక రాబడులు పొందాలనుకుంటున్నారా? నిఫ్టీ మైక్రోక్యాప్ 250లో లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోండి
చాలామంది వ్యాపారాల్లో అధిక లాభాలను పొందాలని భావిస్తున్నారు. ఎందులో వ్యాపారం చేయాలో చాలామందికి తెలియదు. నిఫ్టీలో పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే నిఫ్టి మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ లో పెట్టుబడులు ఎలా పెట్టాలి. వాటి లాభనష్టాలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ అంటే ఏమిటి? నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ భారతదేశంలో ఉన్న చిన్న స్థాయి కంపెనీల అభివృద్ధి అవకాశాలను ట్రాక్ చేసే ప్రత్యేకమైన సూచిక అని చెప్పొచ్చు.
తక్కువ రిస్క్ తో తక్కువ పెట్టుబడులు
ఈ సూచిక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో జాబితా చేసిన 250 మైక్రో-క్యాప్ కంపెనీలను కలిగి ఉంటుంది. ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని పెద్ద కంపెనీలతో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. నిఫ్టీ 50తో పోలిస్తే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది నిఫ్టీ 50 ఇండెక్స్, NSEలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన 50 పెద్ద కంపెనీలను ట్రాక్ చేయనుంది. ఇవి సాధారణంగా స్థిరమైన, బాగా స్థిరపడిన సంస్థలుగా పేరొందాయి. తక్కువ రిస్క్, తక్కువ రాబడులను అందిస్తాయి. అయితే, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ చిన్న కంపెనీలను ట్రాక్ చేస్తుంది. ఇవి అధిక వృద్ధి అవకాశాలను కలిగి ఉంటాయి, ఒకానొక సమయంలో ఇవి ఎక్కువ రిస్క్‌కు కారణమవుతాయి.
ప్రయోజనాల గురించి తెలుసుకోండి
మైక్రోక్యాప్ 250లో పెట్టుబడి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు 1) ఈ సూచికను అనుసరించే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు చిన్న కంపెనీల విస్తృత శ్రేణిలో పెట్టుబడి పెట్టొచ్చు. 2) చిన్న కంపెనీలు సాధారణంగా వృద్ధి దశలో ఉంటాయి. ఇవి ఎక్కువ మార్కెట్ వాటాను పొందుతాయి. 3) ఫండ్ మేనేజర్‌ల ద్వారా పెట్టుబడులు చేపడితే మీరు మార్కెట్ అనిశ్చితులను క్రమబద్ధంగా ఎదుర్కోవచ్చు. 4) ఇండెక్స్ ఫండ్స్ చురుకుగా నిర్వహించే ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ ఖర్చును కలిగి ఉంటాయి.
కలిగే నష్టాలు ఇవే
పెట్టుబడి నష్టాలు 1) చిన్న కంపెనీల స్టాక్స్ అధిక మార్కెట్ మార్పులకు గురవుతాయి. దీనివల్ల పెట్టుబడుల్లో ఎక్కువ నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. 2) చిన్న స్టాక్స్ తరచుగా తక్కువ లిక్విడిటీని కలిగి ఉంటాయి. దీంతో షేర్లను కొనుగోలు చేయడం లేదా అమ్మడం కష్టమవుతుంది. 3) చిన్న కంపెనీలు అధిక వృద్ధి అవకాశాలను కలిగి ఉంటాయి. ఒకవేళ పెద్ద సంస్థలతో పోలిస్తే ఎక్కువ రిస్క్‌లో ఉంటాయి. మీ పెట్టుబడిలో అధిక రాబడులను సాధించాలని అనుకుంటే నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్‌ను అనుసరించి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.