LOADING...
YouTube: స్వచ్ఛందంగా వెళ్లిపోండి: యూట్యూబ్‌లో ఉద్యోగులకు ఎగ్జిట్‌ ప్లాన్
స్వచ్ఛందంగా వెళ్లిపోండి: యూట్యూబ్‌లో ఉద్యోగులకు ఎగ్జిట్‌ ప్లాన్

YouTube: స్వచ్ఛందంగా వెళ్లిపోండి: యూట్యూబ్‌లో ఉద్యోగులకు ఎగ్జిట్‌ ప్లాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్న ఈ సమయంలో, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ యూట్యూబ్ కొత్త నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్‌ ప్లాన్‌ (స్వచ్ఛంద విరమణ ప్యాకేజ్‌) ను ప్రకటించింది. కృత్రిమ మేధ (Artificial Intelligence) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, సంస్థ పెద్ద ఎత్తున మార్పులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్‌ (Neal Mohan) ఈ ప్రకటన చేశారు.

వివరాలు 

వాలంటరీ ఎగ్జిట్‌ ప్రోగ్రామ్

యూట్యూబ్‌ తన ప్రొడక్ట్‌ డివిజన్‌ను కృత్రిమ మేధ ఆధారంగా పునర్‌వ్యవస్థీకరిస్తోంది, ఇది దాదాపు పదేళ్లలో తొలిసారి జరుగుతున్న పెద్ద మార్పు అని నీల్‌ మోహన్‌ సిబ్బందికి పంపిన నోట్‌లో వెల్లడించారు. ఈ మార్పుల కోసం ఎవరినీ బలవంతంగా తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. అయితే, కంటెంట్‌ సృష్టి (Content Creation),వినియోగదారుల అనుభవం (User Experience)లో ఏఐ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, సంస్థ వాలంటరీ ఎగ్జిట్‌ ప్రోగ్రామ్‌ ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు.