ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.
యూట్యూబ్ 2020లో TikTokకి ప్రత్యర్థిగా షార్ట్‌లను పరిచయం చేసింది. అప్పటి నుండి యూట్యూబ్ వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్లకు తక్కువ నిడివి కంటెంట్ కు బాగా ఉపయోగపడింది. యూట్యూబ్ Shorts ప్రతిరోజూ 15 బిలియన్ వ్యూస్ అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోల విషయానికి వస్తే టిక్ టాక్ ఇప్పటికీ రేసులో ముందంజలో ఉంది, కానీ ఇది క్రియేటర్లకు ఆదాయాన్ని ఎప్పుడు ఇవ్వలేదు.
యూట్యూబ్
ఈ కొత్త YPP ఒప్పందంలో నాలుగు మాడ్యూల్స్ ఉన్నాయి
ప్రకటన రాబడిని Shorts క్రియేటర్లతో పంచుకోవాలనే యూట్యూబ్ నిర్ణయానికి ముందు, Shorts క్రియేటర్లు షాపింగ్ ఇంటిగ్రేషన్, సూపర్ చాట్‌లు, యూట్యూబ్ Shorts ఫండ్ వంటి వాటి నుండి డబ్బు సంపాదించారు.
ఈ కొత్త YPP ఒప్పందంలో విభిన్న మాడ్యూల్స్ ఉన్నాయి. అప్డేటెడ్ భాగస్వామ్య ఒప్పందం కోసం యూట్యూబ్ మాడ్యులర్ విధానాన్ని ఎంచుకుంది. "బేస్ నిబంధనలు," "వాచ్ పేజ్ మానిటైజేషన్," "షార్ట్ మానిటైజేషన్", "కామర్స్ ప్రోడక్ట్"తో సహా నాలుగు మాడ్యూల్స్ ఉన్నాయి.
ప్రతి క్రియేటర్ మొదటి భాగాన్ని జూలై 10, 2023లోపు అంగీకరించాలి. లేకుంటే, ఆదాయం వచ్చే ఆప్షన్ ఆఫ్ చేయబడుతుంది. యూట్యూబ్ పూర్తి మానిటైజేషన్ విధానాన్ని అన్‌లాక్ చేయడానికి క్రియేటర్లు అన్ని మాడ్యూళ్లను అంగీకరించాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది.