
Zee layoffs: జీ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
జీ ఎంటర్ టైన్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
కంపెనీ ఒక ప్రకటనలో ఈ సమాచారాన్ని ఇచ్చింది కానీ తొలగించిన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు.
ఈ సంవత్సరం జనవరిలో, జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్ తో విలీన ప్రక్రియ ఆగిన తరువాత మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు.. జీ కంపెనీ నష్టాలను తగ్గించుకోవటానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునిత్ గోయెంకా వెల్లడించారు.
బెంగళూరులో జీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. ఇక్కడి నుంచే టెక్నాలజీ సపోర్ట్, డెవలప్ మెంట్ జరుగుతుంది.
Details
ఇతర భాషల్లోని ఛానెల్స్ లో కూడా ప్రక్షాళన
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జీ నష్టాలను భారీగా తగ్గించే వ్యూహంలో భాగంగా.. జీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో సగం మంది ఉద్యోగులను తొలగించనున్నారు.
ఈ తొలగింపులు పనితీరు ఆధారంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఇదే కాకుండా హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాషల్లోని ఎంటర్ టైన్ మెంట్, న్యూస్ ఛానెల్స్ లో కూడా ప్రక్షాళన జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.