
Ankiti Bose files FIR: జిలింగో మాజీ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ కపూర్, మాజీ సీఓఓ ఆది వైద్యలపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యాషన్ స్టార్టప్ సంస్థ జిలింగో(Zilingo)మాజీ సహ వ్యవస్థాపకుడు (Co-founder) ధ్రువ్ కపూర్(Dhruv Kapoor), మాజీ సీఓఓ (Chief opertating officer) ఆది వైద్యల (Adi Vaidya)పై కేసు నమోదైంది.
జిలింగో సీఈఓ, వ్యవస్థాపక సభ్యురాలు అంకితీబోస్ (Ankiti Bose) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరు తన సంస్థను మోసం చేశారని, తనను బెదిరించడంతోపాటు వేధింపులకు గురిచేశారని, సంస్థకు నష్టం చేకూర్చేలా కుట్రలు పన్నారని అంకితీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధ్రువ్ కపూర్, ఆది వైద్యలు తమ వ్యక్తిగత లాభం కోసం సంస్థను, కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారిని కూడా మోసం చేసినట్లు అంకితీ ఫిర్యాదు చేశారు.
Zilingo-Ankiti Bose
వేధింపులకు గురిచేశారు: అంకితీ బోస్
తప్పుడు ఆరోపణలో తన వాటాను వదులుకునేలా, వ్యాపారంపై తాను నియంత్రణను కోల్పోయేలా ధ్రువ్ తనను మోసం చేసేలా వ్యవహరించాని అంకితీ బోస్ ఆరోపించారు.
ఆది వైద్య కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవిలో ఉన్నప్పుడు తనపట్ల తప్పుగా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు.
తనకు నష్టం కలిగించేలా వ్యవహరించడంతో పాటు తన పేరుమీదు వాణిజ్య అప్పులను వివిధ పార్టీలకు విస్తరించడం వంటి చర్యలకు పాల్పడి తనను తీవ్రంగా నష్టపరిచారని అంకితీ బోస్ తన ఫిర్యాదులో తెలిపారు.
కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి తనను ఓ మోసకారిగా, తప్పుడు వ్యక్తిగా చిత్రించేందుకు ఆది వైద్య ప్రయత్నించారని కూడా తెలిపారు.
ధ్రువ్ కపూర్, ఆది వైద్య లిద్దరూ కంపెనీ కీలక సమాచారాన్ని దాచిపెట్టారని అంకితీ బోస్ వాపోయారు.
Dhruv Kapoor-Adi Vaidya
డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగిన అంకితీ బోస్
ధ్రువ్ కపూర్, ఆదివైద్య లు తన వ్యాపార వ్యూహాలను అణచివేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారని అంకితీ వెల్లడించారు.
2015 లో అంకితీ బోస్, ధ్రువ్ కపూర్ ఇద్దరూ కలసి జిలింగో అంకుర పరిశ్రమను స్థాపించారు.
2019 నాటికల్లా దాని విలువ 7 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.
జిలింగో, దాని అనుబంధ సంస్థల డైరెక్టర్ పదవి నుంచి అంకితీబోస్ 2022లో తప్పుకున్నారు.