Page Loader
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆకుపచ్చ రంగుకు బదులుగా జొమాటో  ట్రేడ్‌మార్క్
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం

Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆకుపచ్చ రంగుకు బదులుగా జొమాటో  ట్రేడ్‌మార్క్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2024
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన కొత్తగా ప్రవేశపెట్టిన 'ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌' డెలివరీ ఫ్లీట్ సేవలను అందించే తమ డెలివరీ బాయ్స్‌ గ్రీన్‌ రంగు యూనిఫామ్‌ బదులు ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది అలా అని'ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌'సేవలను నిలిపివేయడం లేదని,వెజ్‌ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని దీపిందర్ గోయల్ బుధవారం తన తాజా అప్‌డేట్‌లో తెలిపారు. అంతకుముందు మంగళవారం నాడు,జొమాటో 'ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌' పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. శాకాహారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు Zomato తెలిపింది. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్‌ల ఎంపిక,నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎక్స్ ద్వారా అప్డేట్ ఇచ్చిన దీపిందర్ గోయల్