
రికార్డుల సునామి సృష్టించిన కాంతారా
ఈ వార్తాకథనం ఏంటి
కాంతారా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రం, KGF: చాప్టర్ 2 కంటే రాష్ట్రంలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
కాంతారా అత్యధిక ఐదవ వారం కలెక్షన్లను సాధించి, బాహుబలి: ది కన్‌క్లూజన్‌ను అధిగమించింది.
అత్యధిక ఆరవ వారం కలెక్షన్‌లను సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది.
గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమా ఎనిమిదో వారం రికార్డును 50 శాతానికి పైగా తేడాతో బద్దలు కొట్టింది.
భారతీయ సినిమా చరిత్రలో కాంతారా మొదటి 10 వారాలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది, ఇది గతంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు.
ఇంతకముందు ఏ కన్నడ చిత్రానికి లేని రికార్డులు సాధించింది.
కాంతారా
కర్నాటకలో 8వ వారంలో 300కి పైగా థియేటర్లలో ఆడింది
కాంతారా కన్నడ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రం, ఇది KGF: చాప్టర్ 2కు గతంలో ఉన్న రికార్డు.
పెట్టిన పెట్టుబడి కంటే అత్యధిక లాభాలు వచ్చిన చిత్రంగా ఉన్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా రికార్డును దాటేసింది ఈ సినిమా.
ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ అయిన రోజే మల్టీప్లెక్స్ లో కోటి రూపాయల కలెక్షన్ ను సాధించింది. ఒక డబ్బింగ్ చిత్రానికి మల్టీప్లెక్స్ లో ఇటువంటి కలెక్షన్లు రావడం మొదటిసారి.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ జానపద చిత్రంగా కాంతారా నిలిచింది.
కాంతారా ఇప్పటికీ భారతదేశం అంతటా కొన్ని థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నప్పటికీ కొన్ని ఓటిటి వేదికలలో అందుబాటులో ఉంది.