LOADING...
Toxic: టాక్సిక్ రిలీజ్‌కు 100 డేస్‌.. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన యశ్.. కొత్త పోస్టర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్
టాక్సిక్ రిలీజ్‌కు 100 డేస్‌.. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన యశ్.. కొత్త పోస్టర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్

Toxic: టాక్సిక్ రిలీజ్‌కు 100 డేస్‌.. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన యశ్.. కొత్త పోస్టర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేజీఎఫ్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్యాన్‌ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్'పై కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా యశ్ సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను క్లారిటీ ఇచ్చాడు. పోస్టర్‌లో యశ్ బ్యాక్ లుక్ చూపించగా, సినిమా రిలీజ్‌కు ఇక ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ప్రకటించాడు.

Details

టాక్సిక్ రిలీజ్ డేట్ ఖరారు 

ఇప్పటికే మేకర్స్ ప్రకటించినట్లే, యశ్ కూడా తాజా పోస్టర్‌లో మరోసారి రిలీజ్ డేట్‌ను రీ-కన్ఫర్మ్ చేశాడు. టాక్సిక్ మార్చి 19, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ తేదీని నిర్మాతలు చాలా వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. గుడి పడ్వా, ఉగాది, రంజాన్ పండుగలు ఒకదాని తరువాత మరొకటి రావడంతో వరుసగా 4 రోజుల భారీ హాలిడే సీజన్ ఉండబోతోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రణవీర్ సింగ్ నటిస్తున్న 'ధురంధర్ 2'తో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

Details

రైటింగ్‌లో కూడా భాగస్వామి 

యశ్ విడుదల చేసిన పోస్టర్‌లో ముఖ్యంగా కనిపించిన అంశం రచన: యశ్, గీతూ అనే క్రెడిట్. అంటే ఈ సినిమా కథ అభివృద్ధిలో యశ్ నేరుగా భాగమయ్యాడు. గతంలో యశ్ చెప్పినట్లుగా— గీతూ ఒక చిన్న ఐడియాతో వచ్చి, దాన్ని ఇద్దరూ కలిసి భారీ స్కేల్‌తో ఉన్న కథగా తీర్చిదిద్దారు. యశ్ ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌ గానూ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారన్న సందిగ్ధతకు పోస్టర్‌తో ముగింపు లభించింది. చరణ్ రాజ్ లేదా అనిరుధ్ పేర్లు వినిపించినప్పటికీ, చివరకు 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ కంపోజర్‌గా ఫైనల్ అయ్యాడు. సినిమాటోగ్రఫీని నేషనల్ అవార్డ్ విన్నర్, గీతూ భర్త రాజీవ్ రవి నిర్వహిస్తున్నారు.

Advertisement

Details

 హాలీవుడ్ స్థాయి యాక్షన్‌పై భారీ బజ్ 

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'జాన్ విక్' ఫ్రాంచైజీకి పనిచేసిన ప్రపంచ స్థాయి యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ ఈ సినిమాలో అత్యంత కీలక యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కిస్తాడు. మిగతా యాక్షన్ భాగాన్ని భారత జంట అన్బరివ్ చూసుకుంటున్నారు. టాక్సిక్‌ను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో డబ్బింగ్ రిలీజ్ ఉంటుంది. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, సుదేవ్ నాయర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 2026 నుంచే టాక్సిక్ ప్రమోషన్లు భారీ స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ముందుగానే ప్రకటించగా, ఇప్పుడు '100 డేస్ టు గో' పోస్టర్‌తో హైప్ మరింత పెరిగింది.

Advertisement