the odyssey: 12 సినిమాలు.. 12 బ్లాక్‌బస్టర్లు.. క్రిస్టఫర్ నోలన్ ట్రాక్ రికార్డ్ షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్‌లో దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో 'క్రిస్టఫర్ నోలన్' ఒకరు. ఆయన తెరపై కనిపించే హీరో కాదు. శాస్త్రవేత్త కూడా కాదు. కానీ తన కథలతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అసాధారణ సృష్టికర్త. సైన్స్, ఫిజిక్స్, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ కథనాలను అద్భుతంగా మేళవిస్తూ కమర్షియల్ విజయాలను అందుకోవడం నోలన్ ప్రత్యేకత. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన 12 సినిమాలూ బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ది ఒడిస్సీ' (The Odyssey) జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఈ సందర్భంగా నోలన్ చిత్రాల బడ్జెట్, వసూళ్లపై ఓ ప్రత్యేక కథనం.
వివరాలు
ఫాలోయింగ్ (1998)
బడ్జెట్: 6 వేల డాలర్లు
వసూళ్లు: 1.26 లక్షల డాలర్లు
దర్శకుడిగా తన కలను నిజం చేసుకోవడానికి నోలన్ అత్యంత తక్కువ వనరులతో రూపొందించిన తొలి చిత్రం 'ఫాలోయింగ్'.
70 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ బ్లాక్ అండ్ వైట్ నియో-నోయిర్ థ్రిల్లర్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులంతా ఆయన స్నేహితులే.
వారాంతాల్లో మాత్రమే షూటింగ్ జరిపిన ఈ చిత్రం బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది.
వివరాలు
మెమెంటో (2000)
బడ్జెట్: 9 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 43.26 మిలియన్ డాలర్లు
రెండో సినిమాతోనే నోలన్ తన ప్రత్యేకమైన కథనం చెప్పే శైలిని ప్రపంచానికి పరిచయం చేశాడు.
షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌తో బాధపడుతున్న వ్యక్తి ప్రతీకారం తీర్చుకునే కథను రివర్స్ క్రానాలజీ పద్ధతిలో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
ఈ చిత్రం నిర్మాణ వ్యయానికి దాదాపు ఐదు రెట్లు వసూలు చేసింది.
ఇన్‌సోమ్నియా (2002)
బడ్జెట్: 46 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 113.76 మిలియన్ డాలర్లు
1997లో నార్వేలో వచ్చిన 'ఇన్‌సోమ్నియా' సినిమాను ఇష్టపడ్డ నోలన్, అదే పేరుతో హాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో కథారచనలో భాగస్వామ్యం కాని ఏకైక సినిమా ఇదే
వివరాలు
బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ (2005)
బడ్జెట్: 150 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 375.59 మిలియన్ డాలర్లు
1997లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్ అండ్ రాబిన్' తర్వాత ఈ సూపర్ హీరో పాత్రకు ఆదరణ తగ్గింది. అలాంటి సమయంలో నోలన్ 'బ్యాట్‌మ్యాన్ బిగిన్స్'తో బ్యాట్‌మ్యాన్‌కు కొత్త ఊపిరి పోశాడు.
తర్వాత వచ్చిన డార్క్‌నైట్ ట్రైలజీతో ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లాడు.
ది ప్రెస్టీజ్ (2006)
బడ్జెట్: 40 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 109.68 మిలియన్ డాలర్లు
భారీ బడ్జెట్ సినిమాల తర్వాత కూడా కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడం నోలన్ శైలి.
ఇద్దరు మాంత్రికుల మధ్య వృత్తిపరమైన పోటీ ఎలా వారి జీవితాలను ప్రభావితం చేసిందనే అంశంతో రూపొందిన 'ది ప్రెస్టీజ్' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
వివరాలు
ది డార్క్ నైట్ (2008)
బడ్జెట్: 185 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 1.008 బిలియన్ డాలర్లు
డార్క్‌నైట్ ట్రైలజీలో రెండో భాగమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది.
నోలన్ కెరీర్‌లో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ఇదే.
ఇన్సెప్షన్ (2010)
బడ్జెట్: 160 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 864.54 మిలియన్ డాలర్లు
ఇతరుల కలల్లోకి ప్రవేశించి వారి ఆలోచనలను ప్రభావితం చేసే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నోలన్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని తీసుకొచ్చింది.
క్లిష్టమైన కథనాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమాగా నిలిచింది.
వివరాలు
ది డార్క్ నైట్ రైజెస్ (2012)
బడ్జెట్: 250 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 1.085 బిలియన్ డాలర్లు
డార్క్‌నైట్ ట్రైలజీలో చివరి భాగమైన ఈ చిత్రం నోలన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఈ ట్రైలజీ ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఇంటర్‌స్టెల్లార్ (2014)
బడ్జెట్: 165 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 790.65 మిలియన్ డాలర్లు
సైన్స్, ఫిజిక్స్, భావోద్వేగాలను అద్భుతంగా మేళవించిన చిత్రం 'ఇంటర్‌స్టెల్లార్'. ఈ సినిమా అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్‌పై కనీస అవగాహన అవసరమని అభిమానులు చెప్పుకునేంతగా నోలన్ దీన్ని విభిన్నంగా రూపొందించాడు.
వివరాలు
డంకిర్క్ (2017)
బడ్జెట్: 100 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 549.98 మిలియన్ డాలర్లు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డంకిర్క్ తీరంలో చిక్కుకుపోయిన లక్షలాది మంది సైనికుల రక్షణ చర్యల ఆధారంగా రూపొందిన యుద్ధ నేపథ్య చిత్రం ఇది.
నిర్మాణ వ్యయంతో పోలిస్తే దాదాపు 5.5 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది.
టెనెట్ (2020)
బడ్జెట్: 205 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 365.31 మిలియన్ డాలర్లు
కోవిడ్ మహమ్మారి కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి భయపడుతున్న సమయంలో విడుదలైన 'టెనెట్' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
నోలన్‌పై ఉన్న నమ్మకంతో అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు.
వివరాలు
ఒప్పెన్‌హైమర్ (2023)
బడ్జెట్: 100 మిలియన్ డాలర్లు
వసూళ్లు: 975.81 మిలియన్ డాలర్లు
అణుబాంబు పితామహుడిగా పేరొందిన జె. రాబర్ట్ ఒప్పెన్‌హైమర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది.
సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా నిలవడంతో పాటు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.