LOADING...
12a railway colony: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్‌ కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్‌ కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

12a railway colony: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్‌ కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్‌ల ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "12ఏ రైల్వే కాలనీ". నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, గెటప్‌ శ్రీను, వైవా హర్ష తదితరులు నటించారు.

వివరాలు 

కథేంటంటే..:

కార్తీక్(అల్లరి నరేష్)ఒక అనాథ.వరంగల్‌లోని రైల్వే కాలనీలో తన ఫ్రెండ్స్‌తో కలిసి జీవిస్తుంటాడు. అతను స్థానిక రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్)కి నమ్మిన బంటు.గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన టిల్లు..ఈసారి ఏదో మార్గం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్నాడు. ఆప్రయాణంలో ఎన్నికల ప్రచార పనులలో ఒక బాధ్యత కార్తీక్ పై పెడతాడు. రాజకీయ ప్రచారాల్లో యువతను ఆకర్షించడానికి కార్తీక్ ఒక ఆటల పోటీ నిర్వహిస్తాడు.ఆ పోటీల్లోనే .. ఆరాధన (కామాక్షి భాస్కర్)ని చూసి మనస్సు పారేసుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది?ఈ ఆరాధన ఎవరు?ఆమె గతం ఏమిటి?ఆమె నేపథ్యమేంటి? ఆరాధన తన భార్యంటూ కథలోకి వచ్చిన జయదేవ్‌ షిండే (అనీష్‌ కురువిల్లా)కి,హత్యకు ఏమైనా సంబంధం ఉందా?తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

Advertisement