Page Loader
14Days Girl Friend Intlo: అంకిత్‌ కొయ్య, శ్రియా కొంతం జంటగా.. '14డేస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో'

14Days Girl Friend Intlo: అంకిత్‌ కొయ్య, శ్రియా కొంతం జంటగా.. '14డేస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో'

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు యువ నటులు అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ '14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో'. ఈ చిత్రానికి శ్రీహర్ష దర్శకత్వం వహించగా, సత్య నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను పొందింది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

వివరాలు 

కథా సారాంశం: 

హర్ష (అంకిత్ కొయ్య) ఎప్పుడూ ఫిల్మ్ మేకర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఒక డేటింగ్ యాప్ ద్వారా ఆహాన (శ్రియా కొంతం) పరిచయం అవుతుంది. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఒకరోజు, ఆహాన తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ ఉండరని, తన ఇంటికి రమ్మని హర్షను ఆహ్వానిస్తుంది. అయితే, గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన హర్ష అనుకోకుండా ఆ ఇంట్లో 14 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వివరాలు 

ఈ 14 రోజులు హర్ష ఆ ఇంట్లో ఎలా గడిపాడు? 

ఆహాన తన తల్లిదండ్రులకు, తాతకు తెలియకుండా హర్షను దాచడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ముందుగా ఎందుకు తిరిగి వచ్చారు? ఆహానను ఇబ్బందుల్లోకి నెట్టిన మరో సమస్య ఏమిటి? ఈ సమస్య నుంచి ఆహాన, హర్ష ఎలా బయటపడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి!