
Tollywood: నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు,ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరగుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు జరపకూడదని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయకూడదని స్పష్టంగా సూచించింది. తదుపరి సూచనలు వచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
వివరాలు
24 విభాగాల ఫెడరేషన్‌లో ఉన్న అన్ని యూనియన్లు సమ్మె
స్టూడియోలు,ఔట్‌డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించరాదని ఆదేశించింది. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు గట్టి దృష్టితో తీసుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లో ఉన్న అన్ని యూనియన్లు ఏకంగా సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చర్చలు, సంప్రదింపులకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి సూచనలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని మరింత తెలిపింది.