Page Loader
Ram Charan: 'గేమ్‌ ఛేంజర్‌' కోసం 256 అడుగుల కటౌట్.. అభిమానుల సంబరాల్లో అభిమానులు
'గేమ్‌ ఛేంజర్‌' కోసం 256 అడుగుల కటౌట్.. అభిమానుల సంబరాల్లో అభిమానులు

Ram Charan: 'గేమ్‌ ఛేంజర్‌' కోసం 256 అడుగుల కటౌట్.. అభిమానుల సంబరాల్లో అభిమానులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా విజయవాడలో భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల ఎత్తులో రామ్‌చరణ్‌ కటౌట్‌ను అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద స్థాయిలో కటౌట్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అభిమానులు అంటున్నారు. యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశామని, దాదాపు వారం రోజుల పాటు శ్రమించి దీన్ని సిద్ధం చేశామన్నారు.

Details

జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్

చెన్నై నుంచి ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో పాల్గొన్నట్లు అభిమానులు తెలిపారు. ఈ కటౌట్‌ను శనివారం సాయంత్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదల కానుంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.