Prudhvi Raj: ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఇటీవల జరిగిన లైలా ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన, ఎన్నికల సమయంలో ప్రచారం కూడా నిర్వహించారు.
ఈ కారణంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఆయనకు లభించింది.
అయితే, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ అతన్ని పక్కనపెట్టింది.
దీనికి ప్రతిగా, వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జనసేనకు దగ్గరైన పృథ్వీరాజ్, గత ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు.
వివరాలు
అనారోగ్యం బారిన పడిన పృథ్వీరాజ్
ఇటీవల, ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న ఆయన, లైలా ఈవెంట్‌లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనితో వైసీపీ అనుకూలులు సోషల్ మీడియాలో లైలా సినిమాను బహిష్కరించాలని ప్రచారం మొదలుపెట్టారు.
ఈ వివాదం నేపథ్యంలో హీరో, నిర్మాతలిద్దరూ మీడియా ముందుకు వచ్చి, పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే, అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న పృథ్వీరాజ్, అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
ఆయనకు హై బీపీ కారణంగా అతని సన్నిహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విజువల్స్, ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.