Page Loader
Tollywood: '35 చిన్న కథ కాదు' సినిమాకు అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో స్క్రీనింగ్ 
'35 చిన్న కథ కాదు' సినిమాకు అరుదైన ఘనత..

Tollywood: '35 చిన్న కథ కాదు' సినిమాకు అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో స్క్రీనింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

'35 చిన్న కథ కాదు' చిత్రంలో విశ్వదేవ్ ఆర్. ప్రియదర్శి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు.రానా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఒక అరుదైన ఘనత సాధించింది. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీనిని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని ఇండియన్ పనోరమా అధికారికంగా ఎంపిక చేసింది.గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి 28వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ పనోరమా విభాగంలో మొత్తం 25 చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. దీనికోసం 384 చిత్రాలు ఎంట్రీ చేశాయి.అందులో '35 చిన్న కథ కాదు' ఎంపికైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఒక పోస్ట్ చేసింది,ఇది తెలుగు సినిమాకు గర్వకారణమని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్