LOADING...
Tabu: 'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావు'.. హీరోయిన్ల ఏజ్ ట్రోలింగ్‌పై టబు స్ట్రాంగ్ కౌంటర్!
'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావు'.. హీరోయిన్ల ఏజ్ ట్రోలింగ్‌పై టబు స్ట్రాంగ్ కౌంటర్!

Tabu: 'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావు'.. హీరోయిన్ల ఏజ్ ట్రోలింగ్‌పై టబు స్ట్రాంగ్ కౌంటర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ సీనియర్ నటి టబు ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. దాదాపు అన్ని తరాల హీరోలతో కలిసి నటించిన ఆమె, సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమాల విషయానికొస్తే ఎంత స్పష్టంగా ఉంటారో, వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో కూడా టబు అంతే ముక్కుసూటిగా స్పందిస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ల వయసుపై వచ్చే విమర్శలు, గ్లామర్ ప్రపంచంలో ఉండే ఆలోచనా విధానంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

వయసు పెరగడం సహజం

మన వయసు గురించి మనకంటే ఇతరులకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ వయసు పెరగడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. నిన్న 20 ఏళ్ల వయసులో నిద్రపోయి, ఈరోజు ఉదయం 45 ఏళ్ల వ్యక్తిలా ఎవరూ లేవరు కదా? అది ఒక్క రాత్రిలో జరిగే మార్పు కాదని టబు పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను సహజంగా అంగీకరించడంలోనే అసలైన అందం దాగి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. గ్లామర్ ఇండస్ట్రీలో వయసును విమర్శగా చూడకుండా, జీవితంలో భాగంగా స్వీకరించాలని టబు సూచించారు.

Advertisement