
71th National Film Awards: నేషనల్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
71వ జాతీయ అవార్డులు సెప్టెంబర్ 23, 2025న ఘనంగా జరగనున్నాయి. సినీ రంగంలో కష్టపడి సాధించిన ప్రతిభకు గౌరవం లభించే ఈ వేడుక ప్రతి కళాకారుడి జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగివుంటుంది. ఏ విభాగంలో ఎవరు అవార్డు అందుకుంటారన్న ఆసక్తితో సినీప్రేమికులు ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. అందరి మనసులో ఒకే ప్రశ్న - అవార్డులు ఎప్పుడు? ఎక్కడ? ఏ ఛానల్‌లో చూడొచ్చు?
వివరాలు
ఎక్కడ? ఎప్పుడు చూడాలి?
జాతీయ చలనచిత్ర అవార్డులు నేడు సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ విఙ్ఞాన్ భవన్‌లో జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని డీడీ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే ప్రసారం ప్రారంభమవుతుంది. దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. జాతీయ అవార్డులు సమాజంలో విశేష గౌరవప్రదమైన గుర్తింపుగా నిలుస్తాయి. దేశం ఈ ఏడాది 71వ జాతీయ అవార్డుల వేడుకను జరుపుకుంటోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ప్రతిభావంతులైన కళాకారుల సాధనకు ఇది ఒక గౌరవనివాళి. విజేతలకు రాష్ట్రపతి సంతకం చేసిన పత్రం (సనద్) గుర్తింపు చిహ్నం అందజేయడం ద్వారా వారి ప్రతిభను దేశం గుర్తిస్తున్నది.
వివరాలు
ఆగస్టు 1న ప్రకటించిన విజేతల జాబితా ప్రకారం..
12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్,విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ (జవాన్),విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీతాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్,సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ వాల్యూస్ విభాగంలో సామ్ బహదూర్ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.