72nd National Film Awards: నేడే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. రేసులో ఎవరు ఉన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 5:30 గంటలకు విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ విభాగాల్లో అవార్డులు ఎవరిని వరించనున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈసారి విభిన్న కథలు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పలువురు నటులు ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి 'పుష్ప 2' చిత్రంలో తన నటనతో మెప్పించిన అల్లు అర్జున్ పేరు బలంగా వినిపిస్తోంది.
వివరాలు
అతృతుగా ఎదురుచూస్తున్న అభిమానులు
అలాగే మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టి, 'భ్రమయుగం' చిత్రంలోని తన అద్భుత నటనతో ఈ అవార్డు కోసం ప్రధాన పోటీదారుడిగా నిలిచినట్లు సమాచారం.
వీరితో పాటు విక్రమ్ (తంగలాన్), సౌబిన్ షాహిర్ (మంజుమ్మల్ బాయ్స్), ఆసిఫ్ అలీ (కిష్కింద కాండం) కూడా ఉత్తమ నటుడి రేసులో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.
అయితే ఈ పేర్లలో ఎవరు జాతీయ అవార్డును కైవసం చేసుకుంటారు? లేక మరెవరైనా విజేతగా నిలుస్తారా? అనే ఉత్కంఠకు శనివారం సాయంత్రం 5:30 గంటలకు తెరపడనుంది.
సినీ అభిమానులు ఆసక్తిగా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.