Page Loader
Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన "పుష్ప" సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న "పుష్ప 2"పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానులు, అలాగే సినీ ప్రేమికులు ఈ చిత్రాన్ని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు మెరుగులు దిద్దుతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ సినిమా, షూటింగ్ వాయిదా కారణంగా డిసెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల,ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమాకు కౌంట్‌డౌన్ మొదలవుతూ, ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

వివరాలు 

శరవేగంగా షూటింగ్ చేస్తున్న పుష్ప రాజ్ 

"కేవలం 75 రోజులు మాత్రమే పుష్ప రాజ్ రూలింగ్‌ను చూడబోతున్నారు" అంటూ ఈ పోస్టర్‌ను అభిమానుల కోరిక మేరకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో "జాతర పాట" ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ ధీమాగా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సుకుమార్ లాంగ్ షెడ్యూల్‌లో పనులు వేగవంతం చేస్తున్నాడు. "పుష్ప - 2"లో రష్మిక మందాన కథానాయికగా నటిస్తుండగా, ఈ సీక్వెల్‌లో వచ్చే ఐటం సాంగ్‌లో నటించే హీరోయిన్ ఎవరో త్వరలో క్లారిటీ రానుంది. మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్