
8 Vasanthalu OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న '8 వసంతాలు'.. ట్రెండింగ్‌లో రెండో స్థానం!
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా విడుదలైన '8 వసంతాలు' సినిమా మంచి హిట్‌గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఓ విభిన్నమైన ప్రేమకథను తెరకెక్కించగా, స్లో లవ్ స్టోరీల పట్ల ఆసక్తి ఉన్న యూత్ నుంచి ప్రశంసలు అందుకుంది. అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి కీలక పాత్రల్లో నటించగా, వీరి అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వచ్చాయి. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఓ మహిళ జీవితంలో ఎదురయ్యే మలుపులను హృద్యంగా ఆవిష్కరించింది.
Details
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్
థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ మాధ్యమంగా మరింత మందికి చేరుతోంది. జూలై 11, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అవుతోందనీ తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చిందీ చిత్రం. థియేటర్ విడుదలకంటే డిజిటల్ రిలీజ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో ఇది రెండో స్థానంలో కొనసాగుతోంది.