Page Loader
8 Vasanthalu: నెల కూడా కాకముందే… ఓటీటీలోకి వచ్చేస్తున్న '8 వసంతాలు'
నెల కూడా కాకముందే… ఓటీటీలోకి వచ్చేస్తున్న '8 వసంతాలు'

8 Vasanthalu: నెల కూడా కాకముందే… ఓటీటీలోకి వచ్చేస్తున్న '8 వసంతాలు'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి హాలీవుడ్ సినిమాలు నెల రోజులైనా వేచిచూడకుండా ఓటిటిలోకి రావడం అనేకసార్లు చూశాం. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులోనూ కొనసాగుతోంది. ఇటీవలే థియేటర్లకు వచ్చిన *'8 వసంతాలు'* సినిమా, నాలుగు వారాల వ్యవధి కూడా లేకుండానే ఓటీటీలోకి ప్రవేశించనుంది. ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనంతిక సనిల్ కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడిగా హెషామ్ అబ్దుల్ వహబ్ పని చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి బజ్ ఉండటం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా యువతను ఆకట్టుకుంటుందని భావించటం జరిగింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయింది.

Details

ఈనెల 11న స్ట్రీమింగ్

ఇప్పుడీ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్'లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కథ విషయానికొస్తే - అయోధ్య అనే యువతితో కలిసి వరుణ్, సంజయ్ అనే ఇద్దరు యువకులు జీవితంలోకి ప్రవేశిస్తారు. వారి రాక ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? ఆమె భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేసింది? అనే కోణంలో కథ సాగుతుంది. థియేటర్‌లో ఆశించిన విజయం అందుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ వేదికగా యువత మనసులు గెలుచుకుంటుందేమో వేచి చూడాలి.