Loading...
Varanasi: రాజమౌళి 'వారణాసి'కి 80 రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌.. రిలీజ్‌కు స్పీడ్‌ పెంచిన జక్కన్న!
రాజమౌళి 'వారణాసి'కి 80 రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌.. రిలీజ్‌కు స్పీడ్‌ పెంచిన జక్కన్న!

Varanasi: రాజమౌళి 'వారణాసి'కి 80 రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌.. రిలీజ్‌కు స్పీడ్‌ పెంచిన జక్కన్న!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' ఒకటి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు కేవలం 80 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రంలోని ప్రధాన ఐమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ పూర్తైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో రాజమౌళి ఈ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం కాశీ ఘాట్‌లు, వారణాసి నగర వీధులను అచ్చం పోలి ఉండేలా అద్భుతమైన భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌ నిర్మాణానికే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వివరాలు

తొలి తెలుగు చిత్రంగా ప్రత్యేక రికార్డు

ఇప్పటికే కెన్యాలో నిర్వహించిన భారీ షెడ్యూల్‌లో అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ సన్నివేశాలను చిత్రీకరించారు.

అలాగే అంటార్కిటికా ఖండంలో షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా 'వారణాసి' ప్రత్యేక రికార్డు సృష్టించింది. దేశంలోని సహజసిద్ధమైన అటవీ ప్రాంతమైన ఒడిశాలో కూడా ఈ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

హాలీవుడ్‌ స్థాయి సాంకేతికత, అత్యున్నత ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ను భారతీయ తెరపై ఆవిష్కరించే చిత్రంగా 'వారణాసి' నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న లొకేషన్లు, అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ఓ విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్‌ వెల్లడిస్తున్నారు.

వివరాలు

రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో మహేష్ బాబు

ఈ చిత్రంలో మహేశ్‌బాబు రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 'కుంభ' అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రానికి కథ, కథనం వి. విజయేంద్రప్రసాద్‌, ఎస్‌ఎస్‌ కాంచి అందిస్తుండగా, సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకూరుస్తున్నారు. కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT