Peddi: విడుదలకు ముందే అమెరికాలో 'పెద్ది' సెన్సేషన్.. అరగంటలోనే 50 వేల డాలర్ల మార్క్ దాటిన సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను టాలీవుడ్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే ఈ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా యూఎస్‌లోని నార్త్ అమెరికా ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కాగా, ప్రారంభమైన కేవలం 30 నిమిషాల్లోనే సినిమా సంచలన స్పందన అందుకుంది. ప్రీ సేల్స్ ద్వారా 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు సమానం.
వివరాలు
హీరోయిన్ గా జాన్వీకపూర్
ఈ ఊహించని స్థాయి స్పందనతో రామ్ చరణ్ సినిమా జోరు ఇప్పటికే మొదలైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో బుకింగ్స్ పరంగా మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.