Page Loader
పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి
పులిమేక సిరీస్ నుండి ట్విస్ట్ రిలీజ్ చేసిన హీరో నితిన్

పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 25, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన పులి మేక సిరీస్, జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. సిరీయస్ కిల్లర్ ని పట్టుకునే పోలీసాఫీసర్ గా లావణ్య త్రిపాఠి కనిపిస్తుంది. ఆది సాయి కుమార్ ఆమెకు తోడుగా ఉంటాడు. అయితే ఈ సిరీస్ లోంచి కీలకమైన ట్విస్ట్ ని రిలీజ్ చేసారు. హీరో నితిన్, తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సిరీస్ లోని ట్విస్ట్ ని రివీల్ చేసే చిన్నపాటి వీడియోను విడుదల చేసారు. ఆ వీడియోలో పోలీసాఫీసర్ అయిన లావణ్య త్రిపాఠినే సీరియల్ కిల్లర్ గా చూపించారు. పోలీసాఫీసర్ గా ఉంటూ తనే హత్యలు చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.

పులి మేక

సిరీయల్ కిల్లర్ గా మారడానికి కారణం తెలుసుకోమంటున్న టీమ్

కథలోని అతిపెద్ద మలుపును బయటపెట్టిన టీమ్, దానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడమని చెబుతోంది. పులి మేక సిరీస్ కథను కోనవెంకట్ అందించారు. కోన ఫిలిమ్ కార్పోరేషన్ నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్ కు నిర్మాతగా కోనవెంకట్ వ్యవహరించారు. పంతం సినిమా ఫేమ్ చక్రవర్తి ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసారు. ఇతర పాత్రల్లో సుమన్, రాజ చెంబోలు, శ్రీ హన్మంత్, ముక్కు అవినాష్, గోపరాజు రమణ, స్పందన పల్లి, సాయి శ్రీనివాస్ కనిపించారు. మలుపు రివీల్ చేసిన తర్వాత సిరీస్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. పులి మేక మార్కెటింగ్ టెక్నిక్ ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పులిమేక సిరీస్ నుండి ట్విస్ట్ రిలీజ్ చేసిన హీరో నితిన్