Page Loader
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే 
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అప్డేట్

గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 12, 2023
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారని అన్నారు. అదలా ఉంచితే, తాజాగా దర్శకుడు శంకర్, గేమ్ ఛేంజర్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ ని ఈరోజు నుండి తెరకెక్కిస్తున్నట్లుగా ట్వీట్ చేసారు. ప్రస్తుతం శంకర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మెగా వారసురాలు జన్మించిన తర్వాత మొదటిసారిగా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అవుతున్నాడు. కార్తిక్ సుబ్బరాజు కథ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గేమ్ ఛేంజర్ షూటింగ్ పై శంకర్ ట్వీట్