Page Loader
#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్ 
#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్

#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ,నటుడు నితిన్ కెరీర్‌లో అద్భుతమైన హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో విడుదలైనప్పటికీ, భీష్మ ప్రేక్షకులను అలరించింది. అ ఆ తర్వాత నితిన్ కి ఈ సినిమా రెండవ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో నుంచి రెండో సినిమా అనౌన్స్ అయ్యింది. నితిన్ సరసన ముందుగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపికైనా , కాల్షీట్ సమస్యల కారణంగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుండి పెద్ద అప్‌డేట్ వచ్చింది.

Details 

అక్కటుకుంటున్న 'అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్' పోస్టర్  

అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్ అంటూ శాంటాక్లాజ్ గెటప్ లో ఉన్న నితిన్ ని వెనుక నుంచి చూపించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ లుక్ ని అయితే జనవరి 26 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. తాత్కాలికంగా VN2 అనే టైటిల్ పెట్టబడిన ఈ సినిమా ఒక అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్. కోలీవుడ్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దర్శకుడు చేసిన ట్వీట్