Ambajipeta Marriage Band trailer: ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సుహాస్ హీరోగా రానున్న చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి రచయిత,దర్శకుడు దుష్యంత కటికనేని. ఈ చిత్రం ఫిబ్రవరి 2, 2024న విడుదల కానుంది. అంచనాలను పెంచుతూ, మేకర్స్ ఆకట్టుకునే థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మంగలి మల్లికార్జున (సుహాస్),ధనవంతురాలైన లక్ష్మి (శివానీ నగరం) మధ్య చిగురించే ప్రేమతో కథనం ప్రారంభమవుతుంది.
మల్లికి గ్రామ పెద్దకి మధ్య వివాదం
మల్లికార్జున అక్క గ్రామ పెద్ద నుండి అవమానాన్ని ఎదురుకుంటుంది. అక్క విషయంలో మల్లికి గ్రామ పెద్దకి మధ్య వివాదం రాజుకుంటుంది. ఆ వివాదం ఎటు వైపు దారితీస్తుంది? మల్లి ప్రేమకథపై వారి మధ్య గొడవ ఎటువంటి ప్రభావం చూపుతుంది?తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ,దర్శకుడు వెంకటేష్ సమర్పించారు. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.