
Tollywood : ఒక్కసారిగా 5 సినిమాల బాంచ్! 'యాత్ర 2' టీమ్ కొత్త ప్రయత్నం!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి స్థాపించిన 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, తమిళ నటుడు జీవా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ చిత్రానికి అనంతరం కొంతకాలం విరామం తీసుకున్న ఈ నిర్మాణ సంస్థ తాజాగా మళ్లీ క్రియాశీలంగా మారింది. ఎలాంటి హడావుడి లేకుండానే ఒక్కసారిగా ఐదు సినిమాలను లైన్‌లో పెట్టినట్టు సమాచారం, దీంతో ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Details
రెండో వారంలో అధికారిక ప్రకటన
స్మాల్ టు మిడ్ రేంజ్ హీరోలతో రూపొందబోయే ఈ ఐదు సినిమాల గురించి ఆగస్ట్ రెండో వారంలో అధికారిక ప్రకటన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంతేకాదు, సినిమాల షూటింగ్‌లను వెంటనే ప్రారంభించేందుకు షెడ్యూల్స్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టుల్లో యంగ్ హీరోలు నాగ శౌర్య, గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆకాష్ పూరి నటించనున్నారని సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఐదుగురు హీరోలందరికీ ఇటీవల పెద్దగా విజయాలు లేకపోవడంతో, ఈ సినిమాల ద్వారా తిరిగి సక్సెస్ సాధించాలని మేకర్స్ కసిగా ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.
Details
రెండు సినిమాలు చేసిన అనుభవం
ఇందులో సుధీర్ బాబు విషయానికొస్తే, ఇప్పటికే ఈ బ్యానర్‌లో రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈసారి అయినా హిట్ అందుకుంటాడా అనే ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతోంది. అయితే, ఈ ఐదు సినిమాలకు దర్శకత్వం వహించబోయే దర్శకుల పేర్లు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, గతంలో 'యాత్ర' సిరీస్‌తో ఈ బ్యానర్‌లో విజయాన్ని అందించిన మహి వి రాఘవకు మళ్లీ అవకాశం దక్కే సూచనలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఓ కొత్త కథతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.