Daaku Maharaaj: బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'డాకు మహారాజ్'.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది.
శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా,బాబీ డియోల్,సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ్ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో నటించగా, బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, తమన్ మ్యూజిక్ బీజీఎం కాంబో సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ పొందింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.ఇదిలా ఉంటే ,తాజాగా బాలకృష్ణ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్
వివరాలలోకి వెళ్ళితే,'డాకు మహారాజ్'మూవీ విడుదలైన రోజు, జనవరి 12న రాత్రి కొంతమంది బాలకృష్ణ అభిమానులు థియేటర్ వద్ద పొట్టేలును తెచ్చి, బహిరంగంగా కత్తితో గాయాలు చేసి, ఆ రక్తాన్ని సినిమా పోస్టర్ పై చల్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఘటనపై స్పందించిన తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ,వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ వీడియోను పరిశీలించిన తరువాత,ఆర్సీపురం మండలానికి చెందిన శంకరయ్య,తిరుపతి కొర్లగుంటకు చెందిన రమేష్,చింతామణికి చెందిన సురేష్ రెడ్డి,బంగారు పాలెం కు చెందిన ప్రసాద్, పల్లె పట్టుకు చెందిన లోకేష్ బాబును గుర్తించారు.
వారిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.